హైద్రాబాద్, డిసెంబర్ 24 (way2newstv.com)
విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన సినిమా వెంకీ మామ. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటింది. ఇప్పటికే రిలీజ్ అయి 10 రోజులు అవుతున్నా.. మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది.డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకీ మామ తొలి రోజు నుంచే రికార్డ్ వసూళ్లు సాధిస్తోంది. వెంకటేష్, నాగచైతన్యల కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిన వెంకీ మామ, రెండో వారం స్టార్ హీరోల చిత్రాలు రిలీజ్ అయినా అదే హవా కొనసాగించింది. రూలర్, ప్రతీ రోజూ పండగే లాంటి సినిమాలు విడుదలైన కూడా వెంకీ మామ జోరు తగ్గలేదు.
కలెక్షన్లతో దూసుకుపోతున్న వెంకీమా
వెంకీ మామకు సూపర్ హిట్ టాక్ రాకపోయినా వెంకటేష్, నాగచైతన్యల కాంబినేషన్, చాలా కాలం తరువాత ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు రావటంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే వారం తరువాత బాలకృష్ణ రూలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ సినిమాకు డిజాస్టర్ టాక్ రావటం వెంకీమామకు కలిసొచ్చింది. దీంతో రెండో వారం కూడా వెంకీ మామ జోరు కొనసాగింది.ఇప్పటికే ఈసినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరువైనట్టుగా తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినా పది రోజుల్లో ఈ సినిమా 31.40 కోట్ల షేర్ సాధించినట్టుగా ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. వెంకీ మామ దాదాపు 32.2 కోట్ల బిజినెస్ చేసింది. అంటే మరో ఒకటి, రెండు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్, నాగచైతన్య సరసన రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కామెడీ, సెంటిమెంట్‌లు బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ముఖ్యంగా మామా అల్లుళ్లుగా వెంకటేష్, నాగచైతన్యలు తెర మీద సూపర్బ్ అనిపించారు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. అదే ఇప్పుడు వెంకీ మామను లాభల బాట పట్టిస్తుంది.