విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కనిపెట్టిన నాసా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కనిపెట్టిన నాసా

ఫోటోలు విడుదల
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ
న్యూఢిల్లీ డిసెంబర్ 03  (way2newstv.com)
అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసిన దేశం మొత్తం గర్వించిన ప్రయోగం చంద్రయాన్-2. అంతరిక్ష పరిశోధనలో భారత శాస్త్రవేత్తలు చివరి నిమిషం వరకు పోరాడి అనుకున్న లక్ష్యాలను చేరుకోలేక పోయినా, భారత శాస్త్రవేత్తలు చేసిన కృషికి నిలువెత్తు నిదర్శనం చంద్రయాన్ 2.విక్రమ్ ల్యాండర్ చంద్రుడికి సమీపంగా వెళ్లి కుప్ప కూలటంతో నిరాశ చెందిన అసలు విక్రమ్ ఆచూకీ దొరక్క బుర్రలు బద్దలు కొట్టుకున్నారు శాస్త్రవేత్తలు. ఫైనల్ గా విక్రమ్ ఆచూకీ కనిపెట్టారు నాసా శాస్త్రవేత్తలు .
విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కనిపెట్టిన నాసా

విక్రమ్ ల్యాండర్ జాడ కనిపెట్టిన నాసా
ఇస్రో చంద్రయాన్-2 ... అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత్ ప్రయోగించిన చంద్రయాన్ టూ లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలం అతిసమీపంలోకి వెళ్లి ఆ తర్వాత దాని జాడ కనబడకుండా పోయిన విషయం తెలిసిందే. ఇక విక్రమ్ ల్యాండర్ ను మరచిపో వలసిందేనని అందరూ భావించిన సమయంలో తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చంద్రుడిపై ఉన్న విక్రమ్ జాడను కనిపెట్టింది. దానికి సంబంధించిన ఫోటోని షేర్ చేసింది.