డిఫెన్స్ లో రాజకీయ పార్టీలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

డిఫెన్స్ లో రాజకీయ పార్టీలు

విజయవాడ, డిసెంబర్ 21, (way2newstv.com)
అవును… రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్పలేని ప‌రిస్థితి నెల‌కొంటుంది. ఇప్పుడు ఏపీలోనూ అదే జ‌రిగింది. రాష్ట్ర సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన ఒకే ఒక్క ప్రక‌ట‌న అన్నిపార్టీల‌నూ ఇర‌కాటంలోకి నెట్టేసింది. ఆయ‌న ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. నిన్న మొన్నటి వ‌ర‌కు తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన‌ ఇప్పుడు తేలుకుట్టిన దొంగ‌ల్లా వ్యవ‌హ‌రించ‌క త‌ప్పని ప‌రిస్థితిలోకి జ‌గ‌న్ వారిని నెట్టేశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. రాజ‌ధాని విష‌యంలో ఇప్పటి వ‌ర‌కు అమరావ‌తి అనే ప్రచారం జోరుగా ఉంది. అయితే, దీనిని ఇప్పుడు మూడు ప్రాంతాల‌కు విస్తరించేందుకు జ‌గ‌న్ ప్రయ‌త్నిస్తున్నారు.ఇదే విష‌యాన్ని జగన్ తాజాగా ముగిసిన అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల్లో వెల్లడించి సంచ‌ల‌నం రేపారు. 
డిఫెన్స్ లో రాజకీయ పార్టీలు

పైకి ఆయ‌న అనుకుంటున్నాను.. అని మాత్రమే చెప్పినా.. చివ‌రిలో మాత్రం ప్రాంతీయ అభివృద్ధి, అభివృద్ది వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగానే తాను రాజ‌ధానిని మూడు ప్రాంతాల‌కు విస్తరించాల‌ని భావిస్తున్న ట్టు జ‌గ‌న్ వెల్లడించారు. అయితే, అదే స‌మ‌యంలో ఈ విష‌యంపై జీఎన్ రావు క‌మిటీ అధ్యయ‌నం చేస్తోంద‌ని చెప్పారు. అయితే, మూడు ప్రాంతాల‌కు రాజ‌ధానిని విస్తరించాల‌నే ప్రణాళిక ఎలా ఉన్నప్ప టికీ.. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన‌ల‌కు మాత్రం ఇప్పుడు ఆ అవ‌కాశం లేకుండా పోయింద‌నే భావ‌న తెర‌మీద‌కి వ‌చ్చింది.అయితే, మూడు ప్రాంతాల్లో రాజధాని ప్రతిపాదనను చంద్రబాబు వ్యతిరేకించారు. పరిపాలనా వికేంద్రీకరణకు తాము వ్యతిరేకమని, అభివృద్ది వికేంద్రీకరణకు కట్టుబడి వున్నామని స్పష్టం చేశారు. అంటే మూడు రాజధానుల ప్రతిపాదనకు తెలుగుదేశం వ్యతిరేకం. అమరావతిలోనే రాజధాని వుండాలని పట్టుబడుతోంది టీడీపీ. ఈ నిర్ణయంతో మిగతా రెండు ప్రాంతాల్లో తెలుగుదేశానికి రాజకీయంగా ఇబ్బంది తప్పదని రాజకీయ పండితుల విశ్లేషణ. తమ ప్రాంతానికి రాజధాని ఎందుకు వద్దంటున్నారని జనం టీడీపీ మీద రగిలిపోవచ్చు. వైజాగ్‌లో సెక్రటేరియట్‌ ప్రతిపాదన అనగానే, అక్కడ బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు జనం.రాజధాని వికేంద్రీకరణకు టీడీపీ వ్యతిరేకమని తేల్చడంతో, ఉత్తరాంధ‌్ర టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. వ్యతిరేకిస్తే, సొంత ప్రాంతంలోనే ఇబ్బందికర వాతావరణం తప్పదు. జనం ఎదురు తిరిగే ఛాన్సుంది. అటు జనసేన సైతం, జగన్‌ ప్రకటనతో ఇరకాటంలో పడినట్టయ్యింది. సేమ్‌ టీడీపీకి ఉన్న ఇబ్బందే జనసేనది కూడా. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాలనా వికేంద్రీక రణను వ్యతిరేకించారు. అభివృద్ది వికేంద్రీకరణ జరగాలి గానీ, రాజధానుల వికేంద్రీకరణ కాదని ప్రకటించారు. ప్రధాని శంకుస్థాపన చేసిన అమరావతిలోనే సీడ్ క్యాపిటల్ ఉండాలని చెప్పారు. మొత్తంగా ఈ ప‌రిస్తితిని పైకి విమ‌ర్శిస్తున్నా.. సుదీర్ఘ రాజ‌కీయ ప్రయోజ‌నం చూస్తే.. మాత్రం ఈ పార్టీలు త‌ల‌లూప‌క త‌ప్పద‌నే భావ‌న మాత్రం తెర‌మీదికి వ‌స్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.విశాఖకు పెద్ద పీటజీఎన్ రావు కమిటీ దాదాపు 200 పేజీల నివేదికను రూపొందించింది. జగన్ తో భేటీ ముగిసిన తర్వాత జీఎన్ రావు కమిటీ మీడియాతో మాట్లాడింది. ప్రజల అభిప్రాయాలను అన్ని ప్రాంతాలను తిరిగి సేకరించామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా సిఫార్సులు చేశామన్నారు. ఏపీలో ప్రాంతీయ అసమానతలు ఉన్నాయన్నారు. ప్రధానంగా రాయలసీమ బాగా వెనకబడి పోయిందన్నారు. అక్కడ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. ప్రాంతాల మధ్య సమతూకం సాధంచాలన్నారు. దీనికోసం తమ కమిటీ రెండంచెల వ్యూహాన్నిి రూపొందించిందన్నారు. ఒకటి రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రెండు ప్రాంతీయ అసమానతలను తొలగించడం తమ సూచనల్లో ఉన్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధిని నివేదికలో పొందుపర్చామన్నారు. ఒకే చోట అభివృద్ధి జరగడం మంచిదికాదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నారు. ప్రజాభిప్రాయానికి తగ్గట్లుగానే నివేదికను రూపొందించామని చెప్పారు. కోస్తా, రాయలసీమల మధ్య వనరుల వినియోగం సమర్థవంతంగా జరగాలని కమిటీ అభిప్రాయపడిందన్నారు. పదమూడు జిల్లాల అభివృద్ధికి సిఫార్సులు చేశామన్నారు. రాయలసీమలో ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు.పరిపాలన సౌలభ్యం కోసం ఉత్తర, దక్షిణ, మద్య, రాయలసీమరీజియన్ లుగా ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఒక రీజియన్ గా, తూర్పు, పశ్చిమ గోదావరి ,కృష్ణా జిల్లాలు ఒక రీజియన్ గా, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలు ఒక రీజియన్ గా, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను ఒక రీజియన్ గా ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. వరద ముంపు లేని ప్రాంతంలో రాజధాని ఉండాలని సూచించామన్నారు. తుళ్లూరులో కొన్ని జోన్లు వరద తాకిడికి గురవుతున్నాయన్నారు. అమరావతి ప్రాంతంలో గత ప్రభుత్వం అభివృద్ధి చేసిందని, దానిని వాడుకోవాలని సూచించామన్నారు. మిగిలిన ప్రాంతాల్లోనూ కార్యాలయాల ఏర్పాటు చేయాలన్నారు. అమరావతిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. లెజిస్లేచర్ అసెంబ్లీ అమరావతిలోనే శాశ్వతంగా ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. విశాఖలో సెక్రటేరియట్, సీఎం క్యాంప్ ఆఫీస్, వేసవి అసెంబ్లీతో పాటు హైక ోర్టు బెంచ్ ని ఏర్పాటు చేయాలని సూచించాం. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ను ఏర్పాటు చేయాలన్నారు. ఆర్థిక వనరులను దృష్టిలోపెట్టుకునే ఈ సిఫార్సులు చేశామన్నారు. ఈ సిఫార్సులు అమలయితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతుందన్నారు