హైదరాబాద్ డిసెంబర్ 12 (way2newstv.com)
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై కేసీఆర్‌కు ఏపీ సీఎం జగన్ హ్యాట్సాఫ్ చెప్పడం సిగ్గుచేటని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. రేప్ చేసిన వారిపై కేసు విచారణ జరిపి 21 రోజుల్లో శిక్షవేస్తామని చెప్పిన ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇదే తరహా చట్టాన్ని ఆర్ధిక నేరస్తులకు కూడా తీసుకువస్తారా అని ప్రశ్నించారు.
ఎన్ కౌంటర్ పై జగన్ హ్యాట్సాఫ్ చెప్పడం సిగ్గుచేటు: మంద కృష్ణ
ఆర్ధిక నేరస్తుల కేసులు కూడా 21 రోజుల్లో విచారించి ఉరిశిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారుజగన్ కు అవగాహన లోపం ఉందని ఆయన విమర్శించారు.టోల్‌గేట్ దగ్గర టోల్ ఫీజ్ చెల్లించడానికి దిశ వెళ్లిందనడం జగన్ అవగాహనలేమికి నిదర్శనమని అన్నారు. కేసీఆర్, పోలీసుల వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకే ఎన్‌కౌంటర్ చేశారని మంద కృష్ణ మాదిగ విమర్శించారు.