నాగర్ కర్నూల్ డిసెంబర్ 31 (way2newstv.com)
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఇ.శ్రీధర్ ఆదేశాలతో రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ శాఖల అధికారులతో కేసరి సముద్రం నాలుగు వైపులా ఎఫ్ టి ఎల్ పరిధిలో కట్టడాలను నాగర్ కర్నూలు ఆర్డివో నాగలక్ష్మి సంయుక్త సందర్శన నిర్వహించారు. సంబంధిత శాఖల అధికారులతో కలిసి మంగళవారం ఉదయం కేసరి సముద్రాన్ని సందర్శించి, ఆక్రమణలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సందర్శన అనంతరంకేసరి సముద్రం వద్ద నాగర్ కర్నూలు ఆర్డిఓ నాగలక్ష్మి మాట్లాడుతూనాగర్ కర్నూలు పట్టణంలోని కేసరి సముద్రం చెరువు మొత్తం విస్తీర్ణత మరియు చెరువుకు సంబంధించిన ఉయ్యాలవాడ, ఎండబెట్ల,
సరి సముద్రానికి నాలుగు వైపులా ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్, పరిధిలో కట్టడాలను పరిశీలించిన ఆర్డీవో
నాగర్ కర్నూల్ పరిధిలోని నాలుగు వైపుల హద్దులను, ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ పరిధిలోను కట్టడాలను, ఇరిగేషన్ మున్సిపల్, రెవిన్యూ అధికారులతో కలసి సంయుక్తంగా సందర్శించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారని కేసరి సముద్రం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న కట్టడాలను నిలిపివేయాలని కలెక్టర్ గారు ఆదేశించారని, అందుకు అనుగుణంగానే ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్, కట్టడాలు జరుగుతున్న ప్రదేశాలను గుర్తించామని కట్టడాలపై త్వరలోనే సంయుక్త నిర్ణయం తీసుకొని జిల్లా కలెక్టర్ కు నివేదిస్తామని ఆమె పేర్కొన్నారు. అలాగే కేసరి సముద్రం ఎఫ్ టి ఎల్ పరిధి బఫర్ జోన్ ను ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు ఏర్పాటు చేస్తున్నారని, అక్రమణ, అక్రమ కట్టడాలపై పూర్తిస్థాయి నివేదికను సంయుక్త నివేదికను సమర్పిస్తాము అన్నారు. ఆర్డిఓ వెంట నాగర్ కర్నూల్ తాహాసిల్దారు గోపాల్, డిప్యూటీ తాహాసిల్దార్ ఖాజా, ఇరిగేషన్ డిఇ రమేష్, వీఆర్వో నాగయ్య, మున్సిపల్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.