బాబు ఆశ నిరాశేనా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బాబు ఆశ నిరాశేనా

విజయవాడ, డిసెంబర్ 7, (way2newstv.com)
రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు కు బిజెపి చుక్కలు చూపించేస్తుంది. గత ఎన్నికల ముందు బిజెపి పార్టీపైనా మోడీ వంటి నేతల పైనా ఒంటికాలిపై లేచిన చంద్రబాబు కు చెక్ పెట్టడమే లక్ష్యంగా కాషాయ పార్టీ అడుగులు పడుతున్నాయి. టిడిపి తమతో ఆడుకున్న తీరుపై పగతో రగులుతున్న కమలనాథులు ప్రత్యేక వ్యూహంతోనే రాజకీయం నడిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు ప్రధాన పార్టీలు డుమ్మా కొట్టాయి. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. చంద్రబాబు సమావేశం పెట్టిన ఉద్దేశం నెరవేరలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులను నిలిపేసింది. చంద్రబాబు ఎన్నిసార్లు అమరావతిపై ప్రశ్నించినా జగన్ నుంచి సమాధానం రాలేదు.
బాబు ఆశ నిరాశేనా

ఇటీవల రాజధాని అమరావతిని చంద్రబాబు సందర్శించారు. ఆయన కాన్వాయ్ పై దాడులు జరిగాయి. అయితే రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ పదే పదే అమరావతిపై వ్యాఖ్యలు చేస్తుండటాన్ని టీడీపీ ఎప్పటికప్పుడు తప్పుపడుతోంది. అందువల్లనే చంద్రబాబు అన్ని పార్టీల వాయిస్ ను బయటకు పంపాలని భావించారు. ప్రజా రాజధాని అమరావతి పేరిట రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయపార్టీలను , మేధావులను, వ్యాపార, వాణిజ్య వర్గాలను ఆహ్వానించారు.అయితే ఈ సమావేశానికి పేరూ ఊరూ లేని పార్టీలన్నీ హాజరయ్యాయనే చెప్పాలి. చంద్రబాబు దీన్ని చూసి ఒకింత అసహనానికి గురయ్యారని చెబుతున్నారు. ఏపీలో అసలు ఊసేలేని ఫార్వర్డ్ బ్లాక్, సమాజ్ వాదీ పార్టీ, జనతాదళ్ యు, ఆమ్ ఆద్మీ, ఆర్ఎస్పీ, నవతరం పార్టీ, రిపబ్లికన్  పార్టీ ఆఫ్ ఇండియా వంటి పార్టీల ప్రతినిధులు పేర్లను చంద్రబాబు చదువుతున్నప్పుడు ఆయనే ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరినీ కూడకడదామనుకున్న చంద్రబాబుకు ప్రధాన పార్టీలు హాజరుకాకపోవడంపై పార్టీ సీనియర్ నేతలను ఆరా తీసినట్లుసమాచారం.ముఖ్యంగా బీజేపీ ఈ సమావేశానికి హాజరుకాలేదు. మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి ఎవరూ రాలేదు. ఇక జనసేన తరుపున పోతిన మహేష్ హాజరయ్యారు. సమావేశానికి హాజరైన ముఖ్యనేతల్లో చంద్రబాబు తర్వాత సీపీఐ రామకృష్ణ ఒక్కరే కన్పించారు. ఇక టీడీపీ నేతలతో హాలంతా నిండిపోయింది. అమరావతి నిర్మాణంపై జగన్ ప్రభుత్వాన్ని నిలదీయాలని భావించిన చంద్రబాబుకు పార్టీలన్నీ షాకివ్వడంతో నిరాశకు గురయ్యారని తెలిసింది. దీనిపై కొందరు సీనియర్ నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.చంద్రబాబు ఇసుక దీక్ష , అంతకుముందు పవన్ లాంగ్ మార్చ్ కార్యక్రమాలకు బిజెపి సమదూరం పాటించింది.చంద్రబాబు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కి బిజెపి డుమ్మా కొట్టింది. వాస్తవానికి ప్రజా సమస్యలపై విపక్షాన్నిటిని ఏకతాటిపై తేవడం అన్నది చంద్రబాబు లక్ష్యంగా తెరపై కనిపించే దృశ్యం. తెరవెనుక మాత్రం బిజెపితో తక్షణ దోస్తీ టిడిపి ప్రధాన లక్ష్యం అన్నది తేలిపోతుంది. అందుకే ఇది గమనించిన కమలం సొంత ఎదుగుదలపైనే దృష్టి సారించింది. టిడిపి తోక పార్టీగా ఉన్నంత కాలం ఎదుగుదల ఉండదనే బిజెపి ఈ జాగ్రత్తలు తీసుకుంటుంది.ఆంధ్రప్రదేశ్ లో అటు చంద్రబాబు కైనా ఇటు పవన్ కల్యాణ్ కైనా కేంద్రం ఆశీస్సులు లేకపోతే వైసిపి నుంచి కేసుల ముప్పు తప్పదు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి చూపు బిజెపిని ప్రసన్నం చేసుకోవడం మీదే లగ్నమైంది. ఈ రెండు పార్టీల్లో జనసేన నే బిజెపి లైక్ చేసే అవకాశాలు మెండుగా. ఉన్నాయి. చంద్రబాబు విషయంలో దూరం పాటించాలనే బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించినట్లు చెబుతున్నారు. అందుకే చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశానికి దూరంగా కమలనాధులు ఉన్నారన్న టాక్ ఇటు తెలుగుదేశం పార్టీలోనూ విన్పిస్తుండటం విశేషం.