పుట్టగొడుగుల్లా మినరల్ వాటర్ ప్లాంట్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పుట్టగొడుగుల్లా మినరల్ వాటర్ ప్లాంట్స్

విశాఖపట్టణం,డిసెంబర్ 26, (way2newstv.com)
మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటి మూలంగా భూగర్భ జలాలు ఇంకిపోతున్నా పట్టించుకునే నాధుడే కనిపించడం లేదు. అసలే విశాఖను నీటి కరువు వెంటాడుతొంది. వర్షాలు అనుకున్న స్థాయిలో పడకపోవడంతో జలాశయాలు నిండుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో చిన్న చిన్న వీధుల్లో సైతం పుట్టుకొస్తున్న వాటర్‌ ప్లాంట్లు ప్రజల్లో అందోళన రేపుతున్నాయి. పెందుర్తి నుంచి వేపగుంట పరిసర ప్రాంతాల్లో వీధికి ఒకటి చొప్పున వాటర్‌ ప్లాంట్లు అనేకం ఉన్నాయి. పెందుర్తి, సుజాతనగర్,‌ చినముషిడివాడ, పాపయ్యరాజుపాలెం, పురుష్తోత్తపురం, కృష్ణరాయపురం, వేపగుంట ప్రాంతాల్లో సుమారు కామప్పుగా వాటర్‌ ప్లాంటులు ఉన్నట్లు తెలుస్తొంది. వీటి నిర్వహకులు 150 నుంచి 250 అడుగుల వరకు బోరు వేయడం వల్ల భూగర్జ జాలాలు ఇంకిపోతున్నాయి. 
పుట్టగొడుగుల్లా మినరల్ వాటర్ ప్లాంట్స్

ఇంటి అవసరాలకు వేస్తున్న బోర్లులో కుడా నీరు రావడం లేదని ప్లాంట్లు చుట్టు పక్కల నివాసితులు వాపోతున్నారు. ఇది ఇలా వుంటే మరొపక్క అపార్ట్‌మెంట్‌ యాజమానులు కుడా నీటిని వాళ్ల అవసరాలకు భారీగా తోడేస్తున్నారు. ప్లాంటు యాజమానులు జివిఎంసి నీటిని కుడా వదిలి పెట్టడం లేదు. నిబంధనలు పాటించకుండా శుద్ది ప్రక్రియ సాగుతుంది. మినరల్‌ ప్లాంట్‌లో నీటిని శుద్ది చేసి మిశ్రమాన్ని కలపడానికి కెమిస్ట్‌ ఉండాలి. కాని ఎక్కువ ప్లాంట్లలో ఆ పని జరగలేదు. మరొపక్క జివిఎంసి అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహారిస్తున్నారు. తనిఖీలు నిర్వహించిన దాఖలు లేవు. మాముళ్ల మత్తులో కొనసాగుతున్నారు. దీని దృష్ట్యా వాటర్‌ప్లాంట్ల యాజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు, నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు. మరికొన్ని వాటర్‌ ప్లాంటు యాజమానులు జివిఎంసి వాటర్‌ పట్టి, అదే వాటరును మినరల్‌ వాటర్‌గా విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందే శీతాకాలం, ఆపై తుపాను ప్రభావంతో వర్షాలు పడుతున్న దృష్ట్యా ఎక్కడ సీజనల్‌ వ్యాధులు వస్తాయో, ఆస్పటల్‌ చుట్టు ఎక్కడ తిరగాల్సి వస్తాంది అని భయందోళనలో ప్రజలు జివిఎంసి వాటర్‌ కుడా వాడకుండా, ఈ మినరల్‌ వాటర్‌ను నమ్ముకొని, రూ.10లకు కొని తెచ్చుకొని తాగుతున్నారు. దీనినే అదునుగా చేసికొని వాటర్‌ప్లాంటు యాజమానులు వారికి ఇష్టమైన రీతిలో వాటర్‌ను విక్రయిస్తు లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ వాటర్‌లో సరైన రసాయనాల నాణ్యత లేకపోవడంతో సీజనల్‌ వ్యాధులు వస్తున్నాయి అని వినియోగదారులు వాపోతున్నారు. ఏది ఏమైనా జివిఎంసి అధికారులు స్పందించి, వాటర్‌ప్లాంటులను తనిఖీలు చేపట్టి, నాణ్యత పాటించే విధంగా కృషి చేయాలని వాటర్‌ప్లాంట్‌ నీటి వినియోగదారులు కోరుతున్నారు.