మున్సిపల్‌ ఎన్నికల వేడి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మున్సిపల్‌ ఎన్నికల వేడి

వరంగల్, డిసెంబర్ 28, (way2newstv.com)
వరంగల్ జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల సందడి షురూ అయ్యింది  ఉమ్మడి జిల్లాల పరిధిలో మున్సిపల్ ఎన్నికల వేడి నెలకొంది వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ మేరకు మున్సిపల్ యంత్రాంగం ఎన్నికల కసరత్తు మొదలుపెట్టింది.ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల వేడి మొదలైంది. వచ్చేనెలలో ఎన్నికలు జరగనుండంతో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మహబూబాబాద్‌, జనగాం, డోర్నకల్, మరిపెడ, తొర్రూర్‌, నర్సంపేట, పరకాల, జయశంకర్‌ భూపాలపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 200వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడు పెంచింది. 
మున్సిపల్‌ ఎన్నికల వేడి

మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ జిల్లా మొత్తం పర్యటనలు చేస్తూ పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. జనగామ మున్సిపల్ పీఠం కైవసం చేసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కసరత్తు ప్రారంభించారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలను... మున్సిపల్ ఎన్నికల్లో రిపీట్‌ చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేం చేస్తున్నారు. టికెట్ల విషయంలో తాను చెప్పిందే ఫైనల్ అని ముత్తిరెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను దెబ్బ కొట్టాలని టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య ప్రయత్నాలు మొదలుపెట్టారు. వరుస ఓటములతో సతమతమౌతున్న పార్టీని మున్సిపల్ ఎన్నికలతో విజయాల బాట పట్టించాలని బావిస్తున్నారు. వార్డుల్లో టికెట్ ఆశించే వారికి ఇప్పటికే పట్టణ కమిటీ దరఖాస్తులను స్వీకరించింది. మున్సిపాలిటీలో టికెట్‌ కోసం ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారుపార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ మున్సిపల్‌ ఎన్నికలపై కన్నేసింది. ఉమ్మడి వరంగల్‌లో తమ ప్రభావం చూపించాలని బావిస్తుంది. ప్రజల్లో రోజురోజుకు పార్టీకి వస్తున్న ఆదరణ ఓట్ల రూపంలో మలుచుకోవాలని వ్యూహాలను రచిస్తోంది. దీని కోసం తరచు పార్టీ పెద్ద లీడర్లు ఉమ్మడి వరంగల్‌లో పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల సంకల్ప యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లారువచ్చే నెలలో మున్సిపల్ పోలింగ్   ఉండడంతో  రాజకీపార్టీలు రంగంలోకి దిగాయి. గత జూలైలో జరగాల్సిన ఎలక్షన్స్ ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. మున్సిపాల్టీల్లో పాగా వేయడానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీ టిఆర్ఎస్ దూకుడు మీద ఉండగా కాంగ్రెస్ బిజెపి సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, జనగాం ,డోర్నకల్, మరిపెడ, తొర్రూర్, నర్సంపేట, వర్ధన్నపేట ,పరకాల ,జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల హడావుడి మొదలైంది. వీటి పరిధిలో 200 వార్డుల ఎన్నికలు జరగనున్నాయి.టిఆర్ఎస్ దూకుడు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార పార్టీ దూకుడు మీద ఉంది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తోంది మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ జిల్లా మొత్తం పర్యటనలు చేస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. జనగామ మున్సిపల్ మున్సిపల్ పీఠం కైవసం చేసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కసరత్తు ముమ్మరం చేశారు .గత కొన్ని రోజులుగా ఎలక్షన్ పై దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. కోటి  ఆశ లతో  ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు .సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించినట్టు మున్సిపల్ ఎన్నికల్లో వ్యూహలు కూడా ఆచరించాలని చెప్పారు. తాను స్వయంగా పరిశీలించిన తదుపరి టికెట్లు ఇస్తానని ఆశావాహుల తో కుండబద్ధలు కొట్టినట్టు చెపుతున్నారు. వార్ వన్ సైడ్ వార్ వన్ సైడ్ అవుతుందని చెప్పుకొస్తున్నారు. దీంతో ఆశావాహుల మధ్య టికెట్ల కోసం విపరీత పోటీ అనివార్యంగా మారనుంది.కాంగ్రెస్ సన్నద్ధం పుర పోరుకు కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకంగా మారింది .అధికార పార్టీని నిలువరించాలని వ్యూహంతో టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య భావిస్తున్నారు. గత ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందుగా కాంగ్రెస్లో ఎన్నికల సందడి నెలకొంది .వార్డుల్లో టికెట్ ఆశించే వారికి  పట్టణ కమిటీ దరఖాస్తులను స్వీకరించారు.ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తమ తమ అనుచర గణంతో మనోస్థైర్యం నింపుతున్నారసత్తా కోసం చాటుకోవడమా కోసం పై భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ప్రజల్లో రోజురోజుకు పార్టీకి వస్తున్న ఆదరణ ఓట్ల రూపంలో మలుచుకోవాలని వ్యూహాలను రచిస్తోంది .తరచుగా పార్టీ పెద్ద లీడర్లు ఇక్కడ పర్యటన చేస్తున్నారు ఇటీవల సంకల్ప యాత్రలో ప్రజల్లోకి వెళ్లారు. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పాల్గొని శ్రేణుల్లో జోష్ నింపారు. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. పార్టీ నేతల్లో భరోసా నింపారు. పార్టీ సంస్థాగత నిర్మాణం లో భాగంగా ఇప్పటికే సభ్యత్వ నమోదు కూడా పూర్తిచేసి కమిటీల నియామకం చేశారు. మున్సిపల్ ఎన్నికల తేదీ ఖరారు కావడంతో కాషాయ దళంలో సందడి ఊపందుకుంది.మున్సిపాలిటీ ఎన్నికల్లో  టీడీపీ ,వామపక్షాల పార్టీ లో మున్సిపల్ ఎన్నికల సందడి కరువైంది,ఆయా పార్టీలు ఎన్నికల ఊసే ఎత్తడం లేదుమున్సిపాలిటీల వార్డుల వివరాలు జనగామ 30 వార్డులో, మహబూబాబాద్ 36 వార్డులు, భూపాలపల్లి 30 వార్డులు, నర్సంపేట 24 వ వార్డులు, పరకాల 22 వార్డులు, తొర్రూర్ 16 వార్డులు, డోర్నకల్ 15 వార్డులు, మరిపెడ 15 వార్డులో వర్ధన్నపేట 12 వార్డులు మొత్తం 9 మున్సిపాలిటీలు 200 అవార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.