అమరావతిడిసెంబర్ 27 (way2newstv.com)
ఏపీకి ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపట్టణం అంటూ వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి పేర్ని నాని ఖండించారు. శుక్రవారం జరిగిన కేబినెట్ మీటింగ్ తర్వాత మాట్లాడిన ఆయన.. ఆ ప్రకటనతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు. విశాఖ వైసీపీ ఇన్‌చార్జ్ గా విజయసాయి రెడ్డి మాట్లాడి ఉండవచ్చని తెలిపారు. ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మంత్రి నాని
త్వరలో ఏర్పాటు చేయబోయే హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను అనుసరించే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ కమిటీలో మంత్రులు, సీనియర్ అధికారులు ఉంటారని మంత్రి నాని తెలిపారు.విశాఖలో గురువారం జరిగిన అధికారుల సమావేశంలో.. రాజధానిపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించిన తర్వాత సీఎం జగన్ తొలిసారి నగరానికి రాబోతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల 28 సీఎం వస్తున్నారని.. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ వ్యాఖ్యలపైనే మంత్రిని శుక్రవారం మీడియా ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు.