మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు.
హైదరాబాద్ డిసెంబర్ 27 (way2newstv.com)
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తర్వాత యువనేత కేటీఆరే సీఎం అని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్లో ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, కేసీఆర్ తర్వాత ప్రభుత్వ పగ్గాలు ఆయనవేనని ముక్తాయించారు. శుక్రవారం అయన హైదరాబాద్లో మీడియాతో మాట్లడారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం కావడం సహజమేనన్నారు.
కేసీఆర్ తర్వాత సీఎం కేటీఆరే
ఏ ఎన్నికలు వచ్చినా..!
అదే సమయంలో బీజేపీపై, కాంగ్రెస్పై మంత్రి విరుచుకుపడ్డారు. జనవరి 30న కేసీఆర్ సభ పెడతారని ఎవరు చెప్పారు?. ఓ పత్రికలో వచ్చిన వార్త చూసి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు. మతం పేరుతో సమాజాన్ని, మనుషులను విడదీస్తే టీఆర్ఎస్ సహించదు. సెంటిమెంట్ని రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు.సీఎంను అన్ని పార్టీల నేతలు కలవొచ్చు. ఇందుకు ప్రత్యేక కారణాలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. భార్యనే గెలిపించుకునే సత్తా లేని ఉత్తమ్.. మాపై విమర్శలు చేయడమేంటి?’ అని ప్రతిపక్షాలపై శ్రీనివాస్ మండిపడ్డారు.