సేవా కార్యక్రమాలు చేద్దాం

నెల్లూరు డిసెంబర్ 27  (way2newstv.com)
నూతన సంవత్సరాన్ని సేవా కార్యక్రమాలతో మొదలుపెడదాం.  మీ శక్తిమేర వివిధ రూపాలలో పేదలకు సేవా కార్యక్రమాలు చేయడమే మంచిది. గత 5 సంవత్సరాలు ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యే గా ఉన్నప్పటినుంచి ఇదే ఆనవాయితీని పాటిస్తున్నా. నేడు అధికారపార్టీలో ఉన్నా కూడా ఇదే విధంగా ఉంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. 
సేవా కార్యక్రమాలు చేద్దాం

శుక్రవారం  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేఖరుల సమావేశాంలో అయన మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ  నెల్లూరు రూరల్ వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు, కార్యకర్తలు కూడా నూతన సంవత్సరంలో నా కోసం సంపాదనను వృధా చేయవద్దు. సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తే మంచిదని అన్నారు. ఈ సందర్బంగా అయన పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు.
Previous Post Next Post