సైబరాబాద్‌ పోలీసులపై ప్రశంసల వెల్లువ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సైబరాబాద్‌ పోలీసులపై ప్రశంసల వెల్లువ

హైదరాబాద్ డిసెంబర్ 6  (way2newstv.com):
సైబరాబాద్‌ పోలీసులను ప్రముఖులు అభినందిస్తున్నారు. సత్వర న్యాయం చేసినందుకు వారు పోలీసులకు కృతజ్ఞతలు చెబుతున్నారు. సైబరాబాద్ పోలీసులు సహజ న్యాయం చేశారని ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పోలీసులు న్యాయం చేశారని బాబా రాందేవ్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర పోలీసులకు చేతులెత్తి మొక్కుతున్నాను మీరు నిజమైన హీరోలు మనకి కస్టమొచ్చిన కన్నీళ్లొచ్చినా పోలీసోడే వస్తాడు. నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే అంటూ ట్విట్టర్ లో ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు.సీఎం మౌనం గా ఉన్నారంటే ఉగ్ర రూపం చూప బోతున్నారని అర్ధం అని మంత్రి తలసాని అన్నారు. 
సైబరాబాద్‌ పోలీసులపై ప్రశంసల వెల్లువ

మరో సారి ఇలాంటి ఘటనలు జరగకుండా సిఎం గట్టి నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. నిందితుల ఎన్ కౌంటర్ తో దిశ ఆత్మకు శాంతిచేకూరినట్లైంది. పోలీసులకు అభినందనలు. నిందితులకు ఉరిశిక్ష పడాలన్నది అందరి డిమాండ్. ఎన్ కౌంటర్ తో ఆ శిక్ష పడినట్లైంది. మహిళలపై ఆఘాయిత్యాలకు ఆలోచన చేసే వారికి ఇది గుణపాఠం కావాలి అని మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి అన్నారు.మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్‌ మాట్లాడుతూ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ సమాజానికి ఓ మంచి ఉదాహరణ. ఇక నుంచి రేపిస్టులు నేరం చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోతామేమోనన్న భయం ఉంటుందని అన్నారు. బిజెపి సీనియర్‌ నాయకురాలు ఉమాభారతి మాట్లాడుతూ ఈ ఏడాదిలో ఇదే అతి పెద్ద సంఘటన. మహిళల భద్రతకు ఇది గ్యారెంటీ లాంటిది.కన్నకూతుర్ని కోల్పోయిన ఆ తల్లిదండ్రుల బాధను తీర్చలేం. కానీ, ఇప్పుడు ఆమె ఆత్మకు శాంతి చేకూరింది. మహిళల్లో భయం కాస్త తగ్గింది. జై తెలంగాణ పోలీస్‌. క్రిమినల్స్‌కు ఎలా బుద్ధి చెప్పాలో తెలంగాణ పోలీసులను చూసి ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు నేర్చుకుంటారని నమ్ముతున్నా అన్నారు.