ఓల్డ్ సిటీకి మెట్రో - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఓల్డ్ సిటీకి మెట్రో

హైద్రాబాద్ డిసెంబర్ 4 (way2newstv.com)
 పాతబస్తీలో సున్నితమైన అంశాలతో కూడిన చారిత్రక, మతపరమైన కట్టడాలకు ఏమాత్రం నష్టం జరుగకుండా ఐదు స్టేషన్లతో 5.5 కిలోమీటర్ల మెట్రోనిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇప్పటికే 5.5 కిలోమీటర్ల మార్గంలో నిర్మించనున్న 5 స్టేషన్ల పేర్లు ఖరారయ్యాయి. 
ఓల్డ్ సిటీకి మెట్రో

సాలర్జంగ్ మ్యూజియం స్టేషన్, చార్మినార్ స్టేషన్, శాలిబండ స్టేషన్, శంషేర్‌గంజ్ స్టేషన్, ఫలక్‌నుమా స్టేషన్లుగా నిర్మించనున్నారు. మెట్రో అలైన్‌మెంట్ ప్రకారం సాలర్జంగ్ మ్యూజియం, చార్మినార్ కట్టడాలు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ వీటికున్న ప్రత్యేకత, చారిత్రక నేపథ్యం దృష్ట్యా వీటిపేర్లను ఖరారుచేశారు.