రెండు రోజులు ఉచిత వైద్య శిబిరం మరియు హెల్త్ అవేర్నెస్ ఎగ్జిబిషన్. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రెండు రోజులు ఉచిత వైద్య శిబిరం మరియు హెల్త్ అవేర్నెస్ ఎగ్జిబిషన్.

నెల్లూరు డిసెంబర్ 16  (way2newstv.com)
స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో స్థానిక ఇందిరా భవన్ నందు ఉచిత వైద్య శిబిరం మరియు హెల్త్ అవేర్నెస్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ నందు సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల రీత్యా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాధి వచ్చిన తర్వాత బాధ పడటం కంటే ముందస్తు జాగ్రత్తలు పాటించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మంగళ బుధవారాల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరము నందు నెల్లూరు నగరంలోని వివిధ కార్పొరేట్ ఆసుపత్రులకు చెందిన వివిధ స్పెషలిస్ట్ డాక్టర్ లు పాల్గొని వైద్య చికిత్సలు అందిస్తారు అని తెలియజేశారు. 
రెండు రోజులు ఉచిత వైద్య శిబిరం మరియు హెల్త్ అవేర్నెస్ ఎగ్జిబిషన్.

శిబిరం నిర్వహించు రెండు రోజులలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత ఉచిత వైద్య సేవలు అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా మానవ శరీరంలోని వివిధ రకాల అవయవాలు వాటి ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా హెల్త్ అవేర్నెస్ ఎగ్జిబిషన్ను నిర్వహించబడుతుంది అని తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించు ఎగ్జిబిషన్లో శరీరంలోని అవయవాలు వాటి ప్రాముఖ్యత వ్యాధుల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర వివరాలతో కూడిన ఫోటోలను ఎగ్జిబిషన్లో ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా వైద్య శిబిరంలో పాల్గొన్న రోగులకు ఉచిత రక్త పరీక్షలు నిర్వహించి అవసరం మేరకు మందులు ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. నెల్లూరు నగర గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.