నెల్లూరు, డిసెంబర్ 3, (way2newstv.com)
నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ కీలక నాయకులు, స్వయానా సోదరులు బీద రవిచంద్రయాదవ్.. బీద మస్తాన్‌రావు. ప్రస్తుతం బీద రవిచంద్ర నెల్లూరుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు. టీడీపీలో కీలక నాయకులుగా ఎదిగిన వీరు అనేక పదవులు కూడా అనుభవించారు. అయితే, ఇప్పుడు ఈ సోదరుల మధ్య రాజకీ యంగా ఎవరిదారి వారిదే అనే వ్యాఖ్యలు వినిపిస్తు న్నాయి. మస్తాన్ రావు.. ప్రముఖ వ్యాపార సంస్థ బీఎంఆర్‌ను నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్, ఆక్వా ఎక్స్ పోర్ట్ వంటి సహా వివిధ పనులు చేస్తున్నారు. రాజకీయంగా తనకు ఉన్న పలుకుబడిని ఆయన వాడుకుంటున్నారుఅయితే, ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత రాజకీయంగా బీద సోదరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు మొత్తం వైసీపీ కంచుకోటగా మారిపోయింది.
రూట్ మారుస్తున్న నెల్లూరు బ్రదర్స్
టీడీపీ ఒక్క చోట కూడా విజయం సాధించలేదు. ఎవరూ కూడా ప్రభుత్వానికి వ్యతి రేకంగా పనిచేసే నాయకుడు, విమర్శించే నాయకుడు కూడా లేకపోవడం గమనార్హం. అదే సమయంలో వ్యాపారాలు, వ్యవహారాల్లో ఉన్న నాయకులు అయితే, వైసీపీకి టచ్‌లో లేకుండా పనులు జరిగే అవకాశం లేదు. ఇటీవల ఎన్నికల్లో బీద మస్తాన్ రావు టీడీపీ తరఫున నెల్లూరు ఎంపీగా పోటీ చేశారు. భారీ ఎత్తున గెలుపు కోసం కృషి చేశారు. అయితే, వైసీపీ హవాలో ఓడిపోయారు.ఇక, ఎన్నికలకు ముందు బీఎంఆర్ సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి. వాటి కేసులు ప్రస్తుతం నడుస్తు న్నాయి. మరికొన్ని బ్యాంకు లావాదేవీలు కూడా నిలిచిపోయినట్టు తెలుస్తోంది దీంతో ఆర్థికంగా బీద మస్తాన్ రావు ఇబ్బందుల్లో ఉన్నారని అంటున్నారు. మరోపక్క జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా ఉన్న బీద రవిచంద్రయాదవ్ ఉన్నా ముఖ్యమైన నిర్ణయాలు మాత్రం రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యానికే చంద్రబాబు వదిలేశారని, బీద సోదరుల్లో ఆవేదన ఉంది. పైగా ఐటీ దాడుల సమయంలోనూ పార్టీ పెద్దగా తమకు హెల్ప్ చేయ లేదనే భావన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరూ కూడా ఇప్పుడు పార్టీలో అంటీ ముట్టనట్టే ఉంటున్నారు.అయితే, రవిచంద్ర యాదవ్ ఎమ్మెల్సీ కావడంతో ఆయన పార్టీలోనే ఉన్నా.. మస్తాన్ రావు మాత్రం వైసీపీ వైపు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాపారాలు అన్నీ కూడా ప్రభుత్వ కటాక్షంపైనే ఆధారపడి ఉన్న నేపథ్యంలో వైసీపీకి ఇప్పటికే ఆయన సానుకూలంగా మారిపోయారనే వార్తలు గుప్పుమంటున్నాయి. మంత్రి అనిల్‌తోనూ మస్తాన్‌రావు టచ్‌లో ఉంటున్నారని అంటున్నారు. సామాజికవర్గ నేపథ్యంలోనూ వీరు ఒక్కటయ్యారన్న చర్చలు వస్తున్నాయి. ఇదిలావుంటే, జిల్లాలో టీడీపీ పరిస్థితి కూడా బ్యాడ్‌గానే ఉంది. ఈ నేపథ్యంలో ఇక, పార్టీలో ఉండి కూడా ప్రయోజనం లేదనే భావన మస్తాన్ రావులో ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన వైసీపీ వైపు జంప్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. పార్టీకి దూరం...దూరంనెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలక నాయకులు టీడీపీకి ఝలక్ ఇచ్చేందుకురెడీ అయ్యారు. ఇప్పటికే బీసీ వర్గానికి చెందిన బీద మస్తాన్ రావు.. పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా టీడీపీ సహా ఏ పార్టీలోనూ ఉండబోనని మరో సీనియర్ నాయకుడు, ప్రజలకు తలలో నాలుకగా పేరు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గతంలో కాంగ్రెస్‌లో ఉండగా చురుకైన రాజకీయాలు చేసిన బొల్లినేని కృష్ణయ్య ఈ ఏడాది ఎన్నికలకు ముందు చంద్రబాబు ఆహ్వానంతో టీడీపీలోకి వచ్చి.. పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. పార్టీ దీనస్థితిలో ఉన్న ఆత్మకూరులో పార్టీ బలోపేతానికి ఆయన ఎంతో కష్టపడ్డారు.చంద్రబాబు సామాజిక వర్గానికి చెందని బొల్లినేని కృష్ణయ్యకు పార్టీలో వివాదరహితుడు పేరు కూడా వచ్చింది. ఆయన వయసు రీత్యా పెద్ద అయినా.. నవ ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేశారు. ఈ క్రమంలోనే తనకు ఎంతో అచ్చి వచ్చిన ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఈ ఏడాది ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక్కడ నుంచి గెలిచి.. చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తానని కూడా ఎన్నికలకు ముందు ఆయన ప్రతిజ్ఞ చేశారు. అయితే, బలమైన మేకపాటి వర్గం ముందు ఆత్మకూరులో బొల్లినేని కృష్ణయ్య గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. గట్టి పోటీ ఇచ్చినా.. మేకపాటి గౌతం రెడ్డి విజయం సాధించారు.ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో తిరిగి, పలు కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేసిన బొల్లినేని కృష్ణయ్యకు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన మానసికంగా కుంగిపోయారు. అదే సమయంలో పార్టీ నుంచి కూడా బొల్లినేని కృష్ణయ్యకు ఎక్కడా భరోసా కనిపించలేదు. నిజానికి పార్టీలోని రెడ్డి సామాజిక వర్గం తనకు సహకరించలేదనే అభిప్రాయం బొల్లినేని కృష్ణయ్యకి ఉంది. ఈ క్రమంలో ఈ విషయాన్ని చర్చించాలని ఆయన చంద్రబాబు నుంచి అప్పాయింట్ మెంట్ కోరారు. అయితే, ఇప్పటి వరకు ఆయనకు అప్పాయింట్ మెంట్ లభించలేదు. నెల్లూరుకు చెందిన సీనియర్ నేత ఒకరు తనకు అడ్డుపడుతున్నారని బొల్లినేని కృష్ణయ్య అసహనం కూడా వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లాలో గ్రూపు రాజకీయాలతో పార్టీకి మైనస్‌గా మారిన ఓ మాజీ మంత్రి తీరుతో ఇప్పటికే చాలా మంది కీలక నేతలు ఆ జిల్లాలో ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పుడు బొల్లినేని కృష్ణయ్య సైతం తన నియోజకవర్గంలో సదరు మాజీ మంత్రి గ్రూపు రాజకీయాలతో విసిగిపోయి ఉన్నారు. అపాయింట్‌మెంట్ కోరినా కూడా చంద్రబాబు నుంచి బొల్లినేని కృష్ణయ్యకి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. పైగా ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా పార్టీ నుంచి ఆశించకుండానే తాను అన్ని విధాలా ఖర్చు చేశానని, ఇప్పుడు ఓటమి తర్వాత కనీసం పరామర్శకు కూడా తాను నోచుకోలేదని బొల్లినేని కృష్ణయ్య వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీ సహా ఏ ఇతర రాజకీయ పార్టీలోనూ కొనసాగరాదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఆయన తన అభిమానులు, కుటుంబ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారని సమాచారం. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ? చూడాలి.