ఆంధ్రాతో బాటు తెలంగాణ.. కోడి పందాల స్థావరాలు ఏర్పాటు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆంధ్రాతో బాటు తెలంగాణ.. కోడి పందాల స్థావరాలు ఏర్పాటు

హైదరాబాద్ డిసెంబర్ 24 (way2newstv.com)
సాధారణంగా సంక్రాంతి సీజన్ లో ఆంధ్రాలోని పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలలో కోడి పందాల జోరు వినవస్తుంది. కానీ ఈ సారి వెరైటీగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా నుంచి వచ్చింది. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో కోడి పందాల స్థావరాలు ఏర్పాటు చేసుకుని కొందరు వ్యక్తులు కోడి పందాలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రాతో బాటు తెలంగాణ.. కోడి పందాల స్థావరాలు ఏర్పాటు

గ్రామ శివారులో పోలీసులు నేడు దాడి చేయడంతో కోడిపందాల స్థావరాల గుట్టు రట్టయింది. ఈ స్థావరాలు నిర్వహిస్తున్న ఐదు గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.25 వేల నగదు,9 బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. సక్రాంతి సీజన్ కావడంతో ఆంధ్రాతో బాటు తెలంగాణలోని చాలా గ్రామాలలో కోడిపందాలకు కొందరు సిద్ధమైపోతున్నారు.