దివ్యాంగులను మట్టిలో పాతిపెట్టిన వైనం
బెంగళూరు డిసెంబర్ 26 (way2newstv.com)
సూర్యగ్రహణం సమ యంలో కర్ణాటక రాష్ట్రంలో అమానుష ఘటన చోటుచేసు కుంది. చిన్నారులకు అంగవైకల్యం పోతుందనే మూఢనమ్మకంతో చిన్నారులను మట్టిలో పాతిపెట్టిన ఘటన విజయపూర్ కలబురగి సమీపంలో తాజ్ సుల్తానాపూర్ లో వెలుగులోకి వచ్చింది.చిన్నారుల అంగవైకల్యం పోతుందని తల్లిదండ్రులు మూఢనమ్మకం పెంచుకున్నారు.
సూర్యగ్రహణం వేళ అమానుషం
అది కూడా సూర్యగ్రహణం రోజున మట్టిలో పాతిపెడితే మంచి ప్రయోజనం ఉంటుందనే నమ్మకంతో మట్టిలో పాతిపెట్టారు.అయితే ఈ ఘటన పై జన విజ్ఞాన వేదిక అసహనం వ్యక్తం చేసింది.చిన్నారులను మట్టిలో పతిపెడితే శ్వాస తీసుకునే క్రమంలో ఇబ్బందులు పడతారని అన్నారు. తల్లిదండ్రులు ఈ విధమైన విధానాలను విడనాడాలని సూచిస్తున్నారు.