ఏపీలోనూ వ్యక్తిగత పూజలేనా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీలోనూ వ్యక్తిగత పూజలేనా

గుంటూరు, డిసెంబర్ 6, (way2newstv.com)
ఏపీలో ఏకపక్ష విధానాలు అమలు అవుతున్నాయని ప్రతిపక్ష పార్టీలు తరచూ విమర్శలు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగడంలేదని కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నాయి. వంద రోజుల జగన్ పాలన పూర్తి అయిన సందర్భంగా ఒక ఛానల్లో ఇదే విషయాన్ని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేస్వర్లుని అడిగినపుడు ఆయన చెప్పిన సమాధానం ఒక్కటే. వైసీపీలో సమిష్టి నిర్ణయాలే అమలవుతున్నాయని, తమ నాయకుడు జగన్ అందరి అభిప్రాయాలు తీసుకునే పాలన చేస్తున్నాడని చెప్పారు. నవరత్నాల రచనలో అందరి ప్రమేయం ఉందని, దాన్నే ముందు పెట్టి జగన్ ముఖ్యమంత్రిగా అమలు చేస్తున్నారని కూడా ఉమ్మారెడ్డి చెప్పారు. 
ఏపీలోనూ వ్యక్తిగత పూజలేనా

ఇక తాజాగా విశాఖలో జరిగిన లాంగ్ మార్చ్ లో పవన్ కళ్యాణ్ సైతం ఏపీలో ఏక వ్యక్తి పాలన కొనసాగుతోందని గట్టిగానే విమర్శలు చేశారు.నిజానికి రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారం మంత్రివర్గం నిర్ణయం అంటేనే సమిష్టి నిర్ణయం అని నిర్వచించారు. ముఖ్యమంత్రి మంత్రిమండలికి పెద్దగా ఉంటాడు కానీ రాజ్యాంగం ప్రకారం చూస్తే అందరికీ సమాన అవకాశాలు, అధికారాలే నిర్వచించారు. మంత్రివర్గంలో ఏది జరిగినా సమిష్టి బాధ్యత ఉంటుంది. ఇక మారుతున్న కాలంతో పాటే రాజకీయాలు మారుతున్నాయి, వ్యక్తిపూజతో పార్టీలు ఎదిగిన చోట వారే ముఖ్యమంత్రులుగా, ప్రధానులుగా ఉన్న చోట అతి పెద్ద గొంతుక వారిదే అవుతోంది. వారి నిర్ణయాలే సమిష్టి నిర్ణయాలుగా అమలు చేయబడుతున్నాయి. ఇది నిన్నా మొన్న కాదు, చాలా కాలంగా ఉంటూవస్తోంది. పెద్ద నోట్ల రద్దు అంశం నాటి ప్రధాని మోడీ క్యాబినెట్లో ఒకరిద్దరికి తప్ప ఎవరికీ తెలియదు, కానీ చివరి క్షణంలో అది అమోదంగా వచ్చేసింది. ఇక రాష్ట్రానికో ప్రాంతీయ పార్టీ, వాటికి ఒక దళపతి ఉన్నపుడు సహజంగానే ఆయన మొత్తాన్ని ప్రభావితం చేస్తూంటాడు. ఇది గతంలో చంద్రబాబు అయినా, ఇపుడు జగన్ అయినా జరిగేది ఒక్కటే.నిజానికి స్వేచ్చ అన్న దానికి కూడా కొత్త నిర్వచనాలు చెప్పుకోవాల్సివస్తోంది. నాయకుడి పర్మిషన్ తో మాట్లాడడమూ స్వేచ్చగా మారుతోంది. రాజకీయం అన్నది ముందుకు వచ్చాక ప్రతీ మాట ఆచీ తూచీ వాడుతున్న నేపధ్యంలో స్వేచ్చ అన్నది కూడా తగ్గుతూ వస్తోంది. ఏ మాట అంటే పదవికి చేటో అన్న భయం నుంచే స్వేచ్చ కూడా కనుమరుగు అవుతోంది. ఏపీకి సంబంధించి చూస్తే సీపీఐ నేత రామక్రిష్ణ మాట్లాడుతూ జగన్ మంత్రులకు స్వేచ్చ లేదని అనేసారు. ఇదే మాట గతంలో అన్న నందమూరి క్యాబినెట్లో కూడా వినిపించింది, మంత్రులు కట్టు బానిసలు అన్న విమర్శలు నాడు వచ్చాయి.ఇక సబ్జెక్ట్ తెలిసి ఉండి ప్రజలో పలుకుబడి ఉన్న నాయకులకు ఎపుడూ స్వేచ్చ ఉంటుంది. ఏ ప్రభుత్వమైనా కూడా వారికి విలువ ఉంటుంది. మరి రోజురోజుకూ అటువంటి నాయకత్వం తగ్గిపోతూంటే, ఎవరి జెండానో పట్టుకుని గెలిచే పరిస్థితుల్లో నేతలు ఉంటే వారి స్వేచ్చ ఆటోమెటిక్ గా కట్ అయిపోతుంది. జగన్ సర్కార్ విషయానికి వస్తే ఉమ్మారెడ్డి చెప్పినట్లుగా ఇప్పటివరకూ జగన్ తన ఎన్నికల మ్యానిఫేస్టోలో హామీలనే అమలు చేస్తున్నారు. అవి ఎటూ పార్టీ ఆమోదించినవే కాబట్టి ఇందులో మంత్రుల స్వేచ్చకు వచ్చిన ఇబ్బంది ఏదీ లేదు. మునుముందు ఏవైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చినపుడు మంత్రిమండలిలో చర్చ జరిగిందా లేదా అన్నదే చూడాలి. అపుడు కామ్రేడ్ మాటలకు విలువ ఉంటుందేమో?