`బొంబాట్‌`లో జ‌ల‌స్ సాంగ్ ఆఫ్ ది డికేడ్ ... `చుప్ప‌నాతి... ` లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేసిన డైర్ట‌ర్ అనిల్ రావిపూడి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

`బొంబాట్‌`లో జ‌ల‌స్ సాంగ్ ఆఫ్ ది డికేడ్ ... `చుప్ప‌నాతి... ` లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేసిన డైర్ట‌ర్ అనిల్ రావిపూడి

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వర్క్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై `ఈన‌గ‌రానికి ఏమైంది` ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్స్‌గా రాఘ‌వేంద్ర వర్మ(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో విశ్వాస్ హ‌నూర్‌క‌ర్ నిర్మిస్తున్న చిత్రం `బొంబాట్`. జోష్ బి సంగీతం అందిస్తున్న ఈ సినిమా తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి విడుద‌ల చేశారు.
ప‌ట్టి జ‌డ‌ప‌ట్టి మెడ‌ప‌ట్టి నిను గెంటేస్తానే
తిట్టి నిను కొట్టి పొగ‌బెట్టి నిను త‌రిమేస్తానే
పెట్టి మందెట్టి ప‌డ‌గొట్టి నే మెచ్చిన ల‌వరుని చుట్టి మ‌డ‌తెట్టి నీ బుట్టికేసావే
 `బొంబాట్‌`లో జ‌ల‌స్ సాంగ్ ఆఫ్ ది డికేడ్ ... `చుప్ప‌నాతి... ` లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేసిన డైర్ట‌ర్ అనిల్ రావిపూడి

నే ముద్దులు పెట్టిన ఎంగిలి పొంగ‌లి అనుకుంటున్నావే ..............చుప్ప‌నాతి హీ ఈజ్ మై ఓన్ ల‌వ‌ర్ అంటూ సాగే ఈ పాట హీరోయిన్ త‌న ప్రేమికుడు మిస్ అవుతున్నాడ‌ని మ‌రో అమ్మాయితో తిరుగుతున్నాడ‌ని కోపంగా పాడుతున్న‌ట్లు తెలుస్తుంది. ఈ సాంగ్‌ను జ‌ల‌స్ సాంగ్ ఆఫ్ ది డికేట్ అని చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.
ఈ పాట‌ను ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత రామ‌జోగయ్య శాస్త్రి రాయ‌గా, శ‌ర‌ణ్య శ్రీనివాస్ పాడారు. జోష్‌.బి సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు.
రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు సినిమాను తీసుకురావ‌డానికి ప్లాన్  చేస్తున్నారు.