ముగిసిన ఏపీ కెబినెట్ సమావేశం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ముగిసిన ఏపీ కెబినెట్ సమావేశం

అమరావతి డిసెంబర్ 27  (way2newstv.com)
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. శుక్రవారం ఉదయం 11గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం 01:15 గంటలకు ముగిసింది. ఈ సమావేశంలో నవ్యాంధ్ర రాజధానికి సంబంధించి జీఎన్ రావు కమిటీ నివేదిక, స్థానిక ఎన్నికలపై ఈ సమావేశంలో నిశితంగా చర్చించినట్లు సమాచారం.  సమావేశంలో భాగంగా రాజధానిపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మూడు రాజధానులపై కేబినెట్ భేటీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాత నిర్ణయం ప్రకటించాలని అనుకున్నట్లు సమాచారం.వీటితో పాటు రాజధాని రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్స్ అంశంపై చర్చించినట్లు సమాచారం.  
ముగిసిన ఏపీ కెబినెట్ సమావేశం

గతంలో అమరావతిలో ఆలిండియా సర్వీస్ అధికారులు భూములు కొనుగోలుకు చెల్లించిన మొత్తాన్ని తిరిగివారికి చెల్లించేందుకు నిర్ణయం తీసుకుందని సమాచారం. కర్నూలులో వెటర్నరీ కాలేజీ ఏర్పాటుపై కూడా కేబినెట్లో చర్చించారని తెలుస్తోంది.సీఎంకు నివేదిక అందజేత : గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, నిర్మాణాలపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికను సీఎం వైఎస్ జగన్కు అందజేసింది. దాదాపు 4 నెలల పాటు వేర్వేరు సందర్భాల్లో సమావేశమై రాజధాని సహా అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసింది. రాజధాని ప్రాంతంలోని నిర్మాణాలు, ల్యాండ్ పూలింగ్, రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు పైనా ఈ కమిటీ అధ్యయనం చేసింది. కేబినెట్ సమావేశంలో ఉప సంఘం నివేదిక అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం