న్యూ ఢిల్లీ డిసెంబర్ 28(way2newstv.com)
;పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకం గా దేశ వ్యాప్తం గా ఎన్ని ఉద్యమాలు హింస జరుగుతుందో చూశాం.. దేశంలో అల్లకల్లోలంగా పరిస్థితి ఉంటే.. పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు మాత్రం అనుకూలం గా ర్యాలీలు చేయడం విశేషం.తాజాగా మోడీ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా పాకిస్తాన్ కు చెందిన హిందువులు దేశ రాజధాని ఢిల్లీలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు.
సీఏఏ కు పాకిస్తాన్ హిందువుల మద్దతు
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా భారత్ లో చేస్తున్న ఆందోళనలు విరమించుకోవాలని వారంతా కోరారు.తాము పాకిస్తాన్ లో మైనార్టీలు గా వివక్ష కు గురి అయ్యామని.. తమ ఆస్తిని అక్కడి వాళ్లు గుంజుకున్నారని..కట్టుబట్టల తో భారత్ కు వచ్చామని వారు వా పోయారు.తమకు భారత్ పౌరసత్వం ఇవ్వకుంటే తమ బతుకేం కావాలని.. ఎక్కడికి వెళ్లాలని వారు బాధ పడ్డారు. తమకు భారత పౌరసత్వం ఇవ్వాలని.. విపక్షాలు ఆందోళనలు మానాలని కోరారు