వైసీపీ లో ఆనం దుమారం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వైసీపీ లో ఆనం దుమారం

నెల్లూరు, డిసెంబర్ 9, (way2newstv.com)
సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి డిసైడ్ అయినట్లే కన్పిస్తుంది. తనలో పార్టీపై ఉన్న అసంతృప్తి జిల్లా పేరుతో బయటపడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆనం రామనారా‍యణరెడ్డి వ్యాఖ్యలను జగన్ సీరియస్ గా తీసుకున్నా ప్రస్తుతానికి ఆయన వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకునే వీలు లేదు. నిజానికి ఆనం రామనారాయణరెడ్డి సీనియర్ నేతగా ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదు. తాను అనుకున్న విషయాన్ని అధినేతనోనైనా, సీనియర్లతోనైనా చర్చించి ఉంటే బాగుండేది.ఆనం రామనారాయణరెడ్డి 2019 ఎన్నికలకు ముందు మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అప్పటి వరకూ ఆనం రామనారాయణరెడ్డి టీడీపీలోనే ఉన్నారు. కాంగ్రెస్ లో దీర్ఘకాలం కొనసాగిన ఆనం రామనారాయణరెడ్డి 2014 ఎన్నికల తర్వాత అధికార పార్టీ వైపే చూశారు. 
వైసీపీ లో ఆనం దుమారం

టీడీపీలో కూడా ఆనం రామనారాయణరెడ్డి ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి సయితం పదవిని ఆశించారు. కానీ నాలుగేళ్ల పాటు చంద్రబాబు ఆనం రామనారాయణరెడ్డి కుటుంబాన్ని పెద్దగా పట్టించుకోలేదు.దీంతో ఎన్నికలకు ముందు ఆనం రామనారాయణరెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. ఆనం వివేకానందరెడ్డి బతికున్నప్పుడు జగన పైన హార్ష్ కామెంట్స్ చేసినప్పటికీ జగన్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆనం రామనారాయణరెడ్డి తనకు ఆత్మకూరు నియోజకవర్గం టిక్కెట్ కావాలని పట్టుబట్టినా జగన్ అంగీకరించలేదు. అంతేకాకుండా వెంకటగిరి నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చారు. అక్కడ నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు ఉన్నప్పటికీ ఆయన టిక్కెట్ ఇవ్వకుండా ఆనం రామనారాయణరెడ్డికే ప్రాధాన్యత ఇచ్చారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆనం రామనారాయణరెడ్డి మంత్రి పదవి పై ఆశలు పెంచుకున్నారు. అయితే జగన్ ప్రతి జిల్లాల్లో ఎంపిక చేసినట్లే నెల్లూరు జిల్లా విషయంలోనూ ఆనం రామనారాయణరెడ్డిని పక్కన పెట్టారు. బీసీ కోటాలో అనిల్ కుమార్ కు, పార్టీ కోసం త్యాగం చేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతం రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. దీంతో ఆనం రామనారాయణరెడ్డిలో గత ఆరు నెలలుగా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బయటపడిందంటున్నారు. మొత్తం మీద ఆనం రామనారాయణరెడ్డి ఎపిసోడ్ కు జగన్ షోకాజ్ నోటీసుతో సరిపెడతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.అసంతృప్తి ….కారణాలు ఇవేనా నెల్లూరు రాజకీయాలు ఎపి రాజకీయాల్లో విభిన్నంగా సాగుతాయి. ఇక్కడ ఆనం కుటుంబానికి రాజకీయంగా దశాబ్దాలుగా వున్న చరిత్ర వారి ఆధిపత్యాన్ని చెప్పక చెబుతాయి. వైఎస్ జమానాలో ఒక వెలుగు వెలిగిన ఆనం బ్రదర్స్ ఆ తరువాత ఆయన మరణానంతరం కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో చక్రం తిప్పారు. రాష్ట్ర విభజన తరువాత గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్న అందులో వారికి పెద్ద పీట వేసింది లేదు. ఆ తరువాత ఆనం వివేకానందరెడ్డి మరణం ఆనం బ్రదర్స్ కి రాజకీయంగా పెద్ద దెబ్బె తగిలేలా చేసిందిదూకుడు గా రాజకీయాలు చేయడం లో ఆనం వివేకానంద రెడ్డి కి పెట్టింది పేరు. నిత్యం సంచలన వ్యాఖ్యలు వివిధరకాల వేషాలతో ఎప్పుడు వార్తల్లో ఉండేవారు వివేక. ఆయన సోదరుడు రాంనారాయణ రెడ్డి మాత్రం సాఫ్ట్ పాలిటిక్స్ నడిపేవారు. హుందాతనాన్ని పెట్టింది పేరుగా ఉండేవారు. అయితే వివేక మరణం తరువాత చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చకపోవడంతో రాంనారాయణ రెడ్డి వైసిపి లో చేరి వెంకట గిరి నుంచి గెలిచారు. సీనియర్ నేత కావడంతో ఆయనకు మంత్రి పదవి తధ్యమని అంతా అనుకున్నా జగన్ తన సన్నిహితుడు అనిల్ కుమార్ యాదవ్ కి ఆ పదవిని కట్టబెట్టారు. సామాజిక వర్గాల సమీకరణలో రెడ్డి సామాజిక వర్గానికి పరిమిత ప్రాతినిధ్యం ఇవ్వడం వల్ల కూడా కెబినెట్ లో ఆనం కి చుక్కెదురైందనే చెప్పాలి.మంత్రి వర్గంలో ప్రాధాన్యత కల్పించకపోవడంతో బాటు నెల్లూరు లో క్రమంగా తన ఆధిపత్యానికి గండిపడుతూ ఉండటంతో ఆనం రామనారాయణరెడ్డి లో అసంతృప్తి క్రమంగా పెరుగుతూ వస్తుంది. మంత్రి అనిల్ ఒక వైపు కోటంరెడ్డి వర్గం మరో వైపు నెల్లూరు సిటీ లో పట్టు సాధిస్తూ పోతుండటం ఆనం అనుచరుల్లో ఆగ్రవేశాలు పెంచుతూ పోతుంది.ఆనం నెల్లూరు లో గత ఐదేళ్ళుగా మాఫియా రాజ్యం కొనసాగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక నుంచి క్రికెట్ బెట్టింగ్ నుంచి యద్దేచ్ఛగా సాగుతున్న పోలీసులు సైతం అచేతనం అయిపోయారంటూ తూటాలు పేల్చారు. ఆయన ఈ వ్యాఖ్యలను నేరుగా తమ పార్టీపై కాకుండా గత ప్రభుత్వం నుంచి ఇదే ధోరణి లో సాగుతుందన్న అర్ధం తో చేసినా వైసిపి దీన్ని సీరియస్ గానే పరిగణించింది. ఇలాంటివి ఉపేక్షించడం వల్ల పార్టీ లో ధిక్కార ధోరణి క్రమంగా పెరుగుతుందని ఆనం రామనారాయణరెడ్డి వంటి సీనియర్ నేత విషయంలో కఠినవైఖరి శ్రేణుల్లో భయం పెంచుతుందని అధిష్టానం ఆలోచన గా సాగినట్లే కనిపిస్తుంది.నిజానికి ఆనం రామనారాయణరెడ్డి సోదరుడికి ఇటీవల జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ పదవిని ఇచ్చారు. అది కూడా ఆనం రామనారాయణరెడ్డికి ఇష్టం లేనట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆనం విజయకుమార్ రెడ్డి ఎప్పటి నుంచో వైసీపీలో ఉన్నారు. ఆనం రామనారాయణరెడ్డి నిన్న గాక మొన్న వచ్చారు. దీంతో పాటు ఆనం కుటుంబం ఆధిపత్యంలో కొనసాగుతున్న వీఆర్ కాలేజీ వ్యవహారం కూడా ఇందుకు కారణమని చెబుతున్నారు. వీఆర్ కళాశాల ఆధిపత్యాన్ని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గండి కొట్టారని, అది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని గుర్తించే ఆనం రామనారాయణరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.ఇటీవల కాలంలో అక్కడక్కడా వైసిపి లో ధిక్కార ధోరణి మొదలైంది. నెల్లూరు లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు, ఆ తరువాత గన్నవరం ఎమ్యెల్యే వల్లభనేని వంశీ వైసిపి లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని ఆ నియోజకవర్గం ఇంచార్జి యార్లగడ్డ వెంకటరావు అలక మరికొన్ని చోట్ల టిడిపి నేతలు అధికార పార్టీ లోకి రానున్నారన్న వార్తలతో ఆయా ప్రాంతాల్లో అధిష్టానం వైఖరిపై అలకలు ఆగ్రహాలు జగన్ గమనిస్తున్నారు. వీటన్నిటికీ ఒకే దెబ్బకు చెక్ పెట్టేందుకు ఆయన వ్యూహాత్మకంగానే ఆనం వ్యాఖ్యలపై వివరణ కోరుతూ షోకాజ్ నోటీస్ ఇవ్వాలని ఆదేశించడం వెనుక ఈ కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అధిష్టానం వైఖరిపై ఆనం రామనారాయణరెడ్డి ఎలా స్పందిస్తారు అన్న అంశం ఆసక్తికరంగా మారింది. తాడోపేడో తేల్చుకునేందుకు ఆనం సిద్ధం అవుతారా ? కర్ర విరగకుండా పాము చావకుండా వ్యవహరిస్తారా అన్నది వేచి చూడాలి.