ఇండియా వైడ్ గా ఒకే రేషన్ కార్డు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇండియా వైడ్ గా ఒకే రేషన్ కార్డు

న్యూఢిల్లీ, డిసెంబర్ 21, (way2newstv.com)
చ్చే ఏడాది జూన్ 1 నుంచి ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డును అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. జాతీయ ఆహార భద్రతా చట్టం  కింద లబ్ధిదారులు ఇకపై దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులను పొందే అవకాశాన్ని కల్పించనుంది. . ఇప్పటికే ఆరు రాష్ర్టాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కొత్త రేషన్ కార్డు నమూనాను కేంద్రం రూపొందించింది.ఇకపై కొత్త రేషన్ కార్డులను జారీ చేసేటప్పుడు ఈ నమూనాను అనుసరించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. 
ఇండియా వైడ్ గా ఒకే రేషన్ కార్డు

అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఈ నమూనాను రూపొందించినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని ప్రకారం ఇకపై కొత్త రేషన్ కార్డులు స్థానిక భాషతోపాటు హిందీ లేదా ఇంగ్లీష్‌లో ఉంటాయి. రేషన్ కార్డు నెంబరు పది అంకెల ప్రామాణిక సంఖ్యలో ఉంటుంది. మొదటి రెండు అంకెలు రాష్ట్ర కోడ్‌ను సూచిస్తాయి. కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది.వలస వెళ్లే నిరుపేదలకు రేషన్ సరుకులు అందక..ఇబ్బంది పడకూడదన్న ఉద్ధేశ్యంతో కేంద్రం ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది. నకిలీ రేషన్ కార్డులను అరికట్టేందుకు ఆధార్‌ను రేషన్ సరుకుల కోసం తప్పనిసరి చేసింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణతో సహా చాలా రాష్ట్రాల్లో రేషన్ సరుకులు ఎక్కడి నుంచేనా తీసుకొనే సౌకర్యాన్ని కల్పించారు.  ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా లబ్దిదారు బయోమెట్రిక్ /  ఆధార్‌ను ధృవీకరించిన తర్వాత..ఈ పథకం అందుబాటులోకి వస్తుంది