అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో లంచాలు తిన్నారు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో లంచాలు తిన్నారు

అమరావతి డిసెంబర్ 17, (way2newstv.com):
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్కు సంబంధించి సభలో ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్రెడ్డి వివరణ ఇచ్చారు. విపక్ష సభ్యులు సభలోకొచ్చి పచ్చి అబద్దాలు చెబుతున్నారు. దిక్కుమాలిన రీతిలో అబద్ధాలు చెబుతున్నారు. ఈ అంశంపై ప్రివిలేజ్ మోషన్ పెడతామని అన్నారు. గతంలో అవుట్ సోర్సింగ్లో ఉద్యోగం ఇచ్చినప్పుడు, జీతాలిచ్చినప్పుడూ కూడా లంచాలు వసూళ్లు చేశారు. ఔట్ సోర్సింగ్ అన్న పేరుతో చివరకు గుళ్లలో క్లీనింగ్ చేసే శానిటేషన్ పనులు కూడా చంద్రబాబునాయుడు తన బంధువు భాస్కరనాయుడుకి ఇచ్చారు. ఈ పరిస్ధితి ఉండకూడదనే ఒక గొప్ప ఆలోచనతో ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేశామని అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వీలైనంత వరకు ప్రయోజనం కల్పించడమే లక్ష్యం. వారికే పూర్తి వేతనాలు.. లంచాలకు తావు లేని విధానమే కార్పోరేషన్ ఉద్దేశ్యం. ఇది అత్యంత పారదర్శక ప్రక్రియ, ఒక గొప్ప కార్యక్రమం. 
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో లంచాలు తిన్నారు

అయినా బురద చల్లుతున్నారు, రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వీలైనంత వరకు ప్రయోజనం కలిగించడం, కోతలు లేకుండా వారి వేతనాలు పూర్తిగా చెల్లించడంతో పాటు, ఎక్కడా అవినీతి, లంచాలకు తావు లేకుండా ఉండడం కోసమే ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టినా విపక్ష సభ్యులు బురద చల్లుతున్నారని, ప్రతిదీ రాజకీయం చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ప్రతిపక్షం ప్రతినిత్యం దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ.. అసత్యాలు చెబుతున్నారని, అందుకే ఈ అంశంపైనా ప్రివిలేజ్ మోషన్కు వెళ్తామని సీఎం తెలిపారు.‘కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ ఏర్పాటుకు కారణం ఏమిటంటే.. ఔట్ సోర్సింగ్ పేరుతో లంచాలు తీసుకోవడం.. ఉద్యోగం ఇవ్వడం కోసం లంచాలు.. తర్వాత జీతాలు ఇవ్వాలి అంటే మాకింత ఇస్తేనే అని చెప్పి అక్కడా కూడా లంచాలు.. ఇటువంటి పరిస్థితిలో టోటల్గా ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంతా కూడా నష్టపోతున్న పరిస్థితి.‘టోటల్గా ఔట్ సోర్సింగ్ అన్న పేరుతో చివరకు గుళ్లలో క్లీనింగ్ చేసే శానిటేషన్ పనులు కూడా భాస్కరనాయుడు అని చెప్పి చంద్రబాబునాయుడు గారి బంధువుకు మాత్రమే ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇచ్చిన ఏకైక గొప్ప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. చివరకు ఔట్ సోర్సింగ్ అన్న పేరుతో మొత్తం మీద వాళ్లకు సంబంధించిన వాళ్లను పెట్టుకోవడం, వాళ్లకు సంబంధించిన వాళ్లు పూర్తిగా దోచేసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబునాయుడు గారు వ్యవస్థ నడిపితే ఈ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే విధంగా మేం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం’ అని ముఖ్యమంత్రి వివరించారు.
అయితే ప్రసంగాన్ని విపక్షనేత అడ్డుకునే ప్రయత్నం చేయగా.. సీఎం  వైయస్ జగన్ గట్టిగా స్పందించారు. ‘ఆ భాస్కరనాయుడు. ఆయన ఎవరంటే.. కావాలంటే వివరాలు చెబుతా. ఏయే గుళ్లలో ఆయనకు కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఇంతకు ముందు కాంట్రాక్ట్ ఎంత? ఆ తర్వాత కాంట్రాక్ట్ విలువలు మీ హయాంలో ఎంత పెంచారు? ఏయే గుళ్లలో ఎంత పెంచారు. వివరాలు మొత్తం కావాలంటే తీసుకుని ఇస్తాం. ఆ భాస్కరనాయుడు ఎవరు? ఆ భాస్కరనాయుడు మీకు ఏ రకంగా బంధువు అవుతాడన్న వివరాలు కూడా చెబుతాం. అప్పుడు ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టుల్లో అవినీతి ఏ స్థాయిలో ఉంది అంటే, వివరాల్లోకి వెళ్తే ఎక్కడా అంతం ఉండని పరిస్థితి’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.ఇందుకే కార్పొరేషన్
‘ఇలాంటి పరిస్థితుల్లో వ్యవస్థలో పూర్తిగా మార్పులు తీసుకువస్తూ ఉద్యోగులకు వీలైనంత వరకు ప్రయోజనం కలిగే విధంగా, ఆ ఉద్యోగుల కోసం ప్రభుత్వమే స్వయంగా ఒక ఔట్ సోర్సింగ్ ఏజెన్సీగా ఏర్పడి, నేరుగా వారికి సేవలందించేందుకు, వారి జీతాలు ఏ మాత్రం తగ్గకుండా, జీతం మొత్తం వారికే అందేలా చూడడం కోసం, ఎక్కడా కూడా లంచాలు అనే పరిస్థితి రాకుండా ఉండడం కోసం. ఇంకా ఆ తర్వాత ప్రధానంగా ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం ఇచ్చేందుకు ఈ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ అనే కార్యక్రమం చేపట్టాం’ అని ముఖ్యమంత్రి  వివరించారు.
అయితే ఇంత గొప్ప కార్యక్రమం చేపడితే దాంట్లో కూడా బురద చల్లడమే కాకుండా, దాంట్లో కూడా రాజకీయాలు చేస్తున్నారని, దిక్కుమాలిన అబద్ధాలు చెబుతున్నారని, ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు.