మరో ఎన్నికల యుద్ధం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మరో ఎన్నికల యుద్ధం

విజయవాడ, డిసెంబర్ 18, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికల యుద్ధానికి తెరలేవనుంది. వచ్చే ఫిబ్రవరిలో మునిసిపల్ ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి బొత్స చేసిన ప్రకటనతో అన్ని పక్షాలు క్షేత్ర స్థాయిలో సమరానికి రెడీ అయిపోతున్నాయి. ఇప్పటికే క్యాడర్ పరంగా టిడిపి, వైసిపి లు బలంగా 13 జిల్లాల్లో వున్నాయి. జనసేన మాత్రం కింది స్థాయిలో బలహీనంగా కనిపిస్తుంది. ఇక బిజెపి విషయానికి వస్తే ఆ పార్టీ ఇప్పటికే బూత్ స్థాయిలో యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంది. కామ్రేడ్ ల విషయానికి వస్తే వారికి పెద్దగా ఉనికి లేకపోవడంతో అధికారపార్టీ కి కాకుండా స్థానిక పరిస్థితులను బట్టి ఎదో ఒక పార్టీకి బాసటగా నిలిచే వాతావరణమే కనిపిస్తుందిరాష్ట్ర వ్యాప్తంగా వైసిపి డివిజన్ లు, వార్డు ల వారీగా తమ బలం, బలహీనతలను అంచనా వేసే కార్యక్రమానికి ఇప్పటికే శ్రీకారం చుట్టింది. 
మరో ఎన్నికల యుద్ధం

నియోజక వర్గ ఇంఛార్జ్ లు తమ ప్రాంతాల్లో పర్యటనలు మొదలు పెట్టేశారు. ముందుగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు వార్డు ల వారీగా అర్హులు ఎవరన్నది లెక్కేస్తున్నారు. ఏ వార్డు లో తమకు బలం వుంది? ఏ సామాజిక వర్గం ఎక్కువ గా ఉంది? అర్ధ అంగబలం ఉన్నవారు సామాజికంగా క్లిన్ చిట్ వుండే వ్యక్తులను అన్వేషిస్తుంది.స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చన్న సమాచారంతో టిడిపి తన శ్రేణులను ఇప్పటికే సమాయత్తం చేసింది. తమ నియోజక వర్గ ఇంచార్జి లతో కేంద్ర పార్టీ ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది. ఏ ప్రాంతంలో ఎవరు ప్రత్యర్థులకు ధీటైన అభ్యర్దో గుర్తించే పని అంతర్గతంగా చేసి వివరాలు సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్ళినట్లు తెలుస్తుంది. దానికి అనుగుణంగా ఇప్పటికే కార్పొరేషన్, మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసేవారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో కూడా ఇదే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.ప్రస్తుతం గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా జగన్ సర్కార్ సంక్షేమ కార్యక్రమాలను నవరత్నాల పేరిట అమలుకు సిద్ధం అయ్యింది. ప్రతి కుటుంబానికి ఎదో ఒక లబ్ది చేకూరేలా భారీ కార్యాచరణ ఇప్పటికే కొనసాగుతుంది. ఇవన్నీ జనవరి నుంచి ప్రజలకు చేరువ కానున్నాయి. అది పూర్తి అయిన వెంటనే ఫిబ్రవరి లో మునిసిపల్ ఎన్నికల నగారా మోగించేయడం ఖాయమని అధికారపార్టీ లో ప్రచారం నడుస్తుంది. మొత్తానికి జగన్ సర్కార్ కొలువై ఏడాది కాకుండా జరిగే ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రానున్నాయన్నది ఆసక్తికరం అవుతుంది.