కడప, డిసెంబర్ 30, (way2newstv.com)
దూర ప్రాంతాలకు వెళ్లేవారంతా రైలు ప్రయాణంపై ఆసక్తి చూపిస్తారు. నవంబరు నుంచి చాలామంది ఈదిశగా ప్రయత్నించడంతో రిజర్వేషన్లన్నీ ఫుల్లయిపోయాయి. కొన్ని రైళ్లకు రిగ్రెట్ వచ్చేస్తోంది. దీంతో ఏం చేయాలో ప్రయాణికులకు పాలుపోవడం లేదు. తత్కాల్‌పై ఆధారపడదామంటే అది కాస్తా లైన్లు జామ్ అయి కొద్దిమందికే పరిమితమవుతోంది. ప్రస్తుతం కడప నుంచి హైదరాబాదుకు వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో 80, రాయలసీమలో 70, చెన్నై–మంబయి దాదర్‌లో 80, చెన్నై–ఎగ్మోర్‌లో 40, తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో 100, ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌పెస్‌లో 120, కన్యాకుమారి జయంతి ఎక్స్‌ప్రెస్‌లో 100కు పైగా, చెన్నై–ముంబయి మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లో 90కి పైగా వెయిటింగ్ లిస్టు కొనసాగుతోందని రైల్వే వర్గాలు తెలిపాయి.
సంక్రాంతి ప్రయాణ కష్టాలు
ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కడప మీదుగా రాకపోకలు సాగించేందుకు కొన్ని ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రజలు కోరుతున్నారు. పండగనగానే సొంతూళ్లకు చేరుకోవాలనే ఉత్సాహం ఉంటుంది.కానీ ఎలా చేరుకోవాలో అర్ధం కావడం లేదని రాజంపేటకు వెంకట రమణమూర్తి వాపోయారు. ఈయన కాకినాడ వెళ్లాల్సి ఉంది. సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణీకులు రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ఇప్పటి వరకు అదనపు బోగీలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ప్రయాణీకులు ఆశలు వదలుకున్నారు. రెండేళ్ల కిందట ప్రత్యేక రైళ్లు నడిపి అదనంగా వసూలు చేయడాన్ని ఈ సందర్భంగా ప్రయాణీకులు గుర్తు చేసుకుంటూ , ప్రీమియం రైళ్లలో రోజురోజుకూ టికెట్ ధరలు మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సరికదా ఆర్టీసీ బస్సులో వెళ్దామంటే సంబంధిత అధికారులు రిజర్వేషన్ సైట్లను నిలిపివేస్తున్నారు. ప్రత్యేక బస్సులు నడుపుతున్నా అదనపు చార్జీలు మోత తప్పడంలేదు. సాధారణ రోజుల్లో రైల్వే చార్జీలు కంటే ఆర్టీసీ చార్జీలు ఎక్కువ. పండగ రోజుల్లో డిమాండ్ బట్టి రేట్లు పెంచేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ మరింత దారుణంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే 30శాతం వరకు రేట్లను పెంచేసిన యాజమాన్యాలు సంక్రాంతి తర్వాత వారం రోజులపాటు టికెట్ ధరపై వెయ్యి నుంచి రూ.1200 వరకు వసూలు చేయడం పరిపాటిగా మారింది. ఏటా ప్రయాణీకులను ప్రైవేటు, రైల్వే, ఆర్టీసీ యాజమాన్యాలు దోచేస్తున్నాయి. మరో వైపు ఉద్యోగులకు, ఉపాధ్యాయులలకు సంక్రాంతి సెలవులపై స్పష్టత రాకపోవడంతో రిజర్వేషన్‌పై వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వేషన్ కావాలన్న దొరక్కపోవడంతో మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ చుట్టూ తిరుగుతున్నారు.