దిశ చట్టం మహిళలకు ఒక ‘శ్రీరామ రక్ష’ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దిశ చట్టం మహిళలకు ఒక ‘శ్రీరామ రక్ష’

ఇందుకు సీఎం  వైయస్ జగన్కు కృతజ్ఞతలు
మంత్రి వనిత
అమరావతి డిసెంబర్ 13 (way2newstv.com)
మహిళల భద్రత కోసం రూపొందించిన దిశ చట్టంపై శుక్రవారం శాసన సభలో చర్చ జరిగింది. సభలో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ  మహిళల భద్రత కోసం కొత్త చట్టం తీసుకువచ్చిన  ముఖ్యమంత్రికి మొత్తం మహిళల తరపున ధన్యవాదాలు అన్నారు.  రాష్ట్రంలోనూ, దేశంలోనూ మహిళలపై రోజూ అత్యాచారాలు జరుగుతున్నాయి. కానీ చాలా వరకు బయటకు రావడం లేదు.  మహిళల పక్షాన ఎంతో మానవత్వంతో ఆలోచించిన ముఖ్యమంత్రి  వైయస్ జగన్ ఈ చట్టం చేశారు.  మహిళలను దేవతలుగా భావించే ఈ గడ్డపై నిత్యం ఎన్నో దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. 
దిశ చట్టం మహిళలకు ఒక ‘శ్రీరామ రక్ష’

ఈ పరిస్థితి భయం కలిగిస్తోంది.  విశాఖ జిల్లా మాడుగుల మండలం వాకపల్లిలో శ్రీదేవి అనే గిరిజన మహిళపై అత్యాచారం జరిగింది.  పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి చెందిన ఒక శాసనసభ్యుడు ఒక మహిళా ఎమ్మార్వో జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టాడు.  అయినా అప్పటి సీఎం చంద్రబాబు, ఆ శాసనసభ్యుడిని వెనకేసుకొచ్చారని ఆరోపించారు.  తెలంగాణలో దిశ కేసులో నిందితులకు వెంటనే శిక్ష పడాలని ప్రజలంతా కోరారు.  ఇవాళ చిన్న పిల్లల మీద జరుగుతున్న దాడులు చూస్తుంటే, అలాంటి ఒక చట్టం ఉంటే బాగుంటుందని ఒక మహిళగా, ఒక తల్లిగా నాకూ కలిగింది.  ఈ పరిస్థితుల్లో మహిళలకు ఎంతో అండగా నిలుస్తూ, ముఖ్యమంత్రి  వైయస్ జగన్ ఒక చట్టం తీసుకురావడం ఎంతో సంతోషం కలిగిస్తోందని అన్నారు.  జిల్లా తొలి మహిళపైనా వేధింపులు చూశాం. ఇంకా గత ప్రభుత్వం పాలు పోసి పోషించిన కాల్ మనీ సెక్స్ రాకెట్ను కూడా చూశాం.  అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ కేసులో నిందితులు ఎక్కడ దొరికిపోతారో అని చెప్పి, అప్పటి సీఎం అంబేడ్కర్ స్మృతి వనం పేరుతో సభలో చర్చ చేపట్టారు.  కాబట్టి ఈ ప్రభుత్వం ఆ కేసులో విచారణ జరపాలని కోరుతున్నారు.  రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆరోజు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. గ్రామాల్లో మంచినీరు దొరక్కపోయినా, మద్యం విచ్చలవిడిగా దొరికింది.  మా నియోజకవర్గంలో అప్పటి సీఎం ఒక సమావేశం ఏర్పాటు చేసి బెల్టుషాపులు ఉంటే తోలు తీస్తామన్నారు. కానీ ఆ పని చేయలేదు.  ఈ ప్రభుత్వం వచ్చాకే గ్రామాల్లో బెల్టు షాపులు తొలగిపోయాయి. అంతే కాకుండా మద్యం షాపులు కూడా తగ్గించారు.  నాలుగు దశల్లో మద్యపాన నిషేధం దిశలో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీనిపై మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.  మహిళలు, పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాంటివి జరగకుండా ఉండాలంటే చట్టాలు కఠినంగా ఉండాలి. దోషులకు చాలా వేగంగా శిక్ష పడాలని అన్నారు.  ఒక దళిత మహిళకు హోం శాఖ ఇవ్వడం నిజంగా ఒక చరిత్ర.  నామినేటెడ్ పదవులు, నామినేషన్ పద్ధతిలో ఇచ్చే పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం, వాటన్నింటిలో 50 శాతం మహిళలకు ఇవ్వడం ఒక చరిత్రాత్మక నిర్ణయం.  మహిళల భద్రత కోసం ప్రత్యే చట్టం రూపొందించిన ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిల్చారు.  గత ప్రభుత్వ హయాంలో కొత్త ఉద్యోగాలు రాకపోగా, ఉన్న ఉద్యోగాలు పోయాయి.  కానీ ఈ ప్రభుత్వం ఏర్పడగానే దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఇది కూడా ఒక చరిత్ర. ఈ స్థాయిలో కొత్త ఉద్యోగాలు గతంలో ఎవరూ సృష్టించలేదని ఆమె అన్నారు. మహిళలపై అత్యాచారాల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు నేరస్తులకు ఒక సింహస్వప్నం. నేరం చేయడానికి వారు భయపడేలా చేస్తుంది.  ఈ దిశ చట్టం మహిళలకు ఒక ‘శ్రీరామ రక్ష’ ఉంటుందని భావిస్తూ, ఇందుకు ముఖ్యమంత్రి కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.