కేంద్రమంత్రితో మంత్రి జగదీశ్ రెడ్డి భేటీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేంద్రమంత్రితో మంత్రి జగదీశ్ రెడ్డి భేటీ

న్యూఢిల్లీ డిసెంబర్ 03,  (way2newstv.com)
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి జగదీశ్ రెడ్డి, రాజ్యసభ ఎం.పి.బడుగుల లింగయ్య యాదవ్, నామా నాగేశ్వరరావు ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గొంగిడి సునీత ఇతరులు మంగళవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల అంశాలపై చర్చించారు. మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అందజేసాం. గతంలో తెలంగాణ రాష్ర్టానికి జాతీయ రహదారుల కేటాయింపు అంశంలో అన్యాయం జరిగింది. ఇదే అంశాన్ని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారని అన్నారు. 3, 150కిలో మీటర్ల జాతీయ రహదారులు కేటాయిస్తామని ప్రధాని మోదీ మాట ఇచ్చారు. 
కేంద్రమంత్రితో మంత్రి జగదీశ్ రెడ్డి భేటీ

అందులో 600 కిలో మీటర్లకుపైనా నంబరింగ్ ఇవ్వలేదని అన్నారు. నంబరింగ్ ఇచ్చిన రహదారుల పనులు కూడా ప్రారంభించలేదు. కొత్తవాటికి నంబరింగ్ ఇచ్చి పనులు వేగవంతం చేయాలని కోరామని అన్నారు. వర్షాల వల్ల రాష్ర్టంలోని జాతీయ రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటన్నింటిని త్వరగా రిపేర్లు చేయాలని కోరినం. హైదరాబాద్ నుండి భూపాలపల్లి 163 జాతీయరహదారిలో రెండు చోట్ల అండర్ పాస్ లు మంజూరు చేయాలని కోరామని అన్నారు.టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ కోదాడ-మిర్యాలగూడ జాతీయ రహదారి 167లో మరికొన్ని ప్రాంతాల్లో కూడా అండర్ పాస్ లు నిర్మాణం చేయాలని కోరినం. చేవేళ్ల-బీజాపూర్ జాతీయరహదారి అంశాన్ని వేగవంతం చేయాలని కోరామని అన్నారు. హైదరాబాద్ చూట్టు రిజనల్ రింగ్ రోడ్డు అంశాన్ని త్వరగా చేపట్టాలని కోరినం. అన్ని అంశాలపట్ల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని అన్నారు. గతంలో హామీ ఇచ్చిన జాతీయ రహదారుల నిర్మాణ అంశం పెండింగ్ లో ఉందని అన్నారు.ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వెళ్లే 63జాతీయ రహదారి వెళ్తోంది. ఇందులో మూడు చోట్ల ఫ్లైఓవర్లు, జంక్షన్లను అభివృద్ధి చేయాలని కోరినం. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు.