న్యూ ఢిల్లీ డిసెంబర్ 26 (way2newstv.com)
ఎంతో మంది భారతీయుల మాదిరిగా నేను కూడా సూర్య గ్రహణం చూద్దామని ప్రయత్నించాను. కానీ ఆకాశంలో సూర్యుడికి మేఘం అడ్డు రావడం వల్ల సూర్య గ్రహణం కనిపించలేదు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్ష్యాత్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ.సూర్య గ్రహణం పై ఆయన ట్విట్టర్ లో ఈ విధంగా స్పందించారు. సూర్య గ్రహణం ప్రత్యక్షంగా కనిపించకపోయినా తాను నిరాశ చెందలేదని ఆయన అన్నారు.
ప్రత్యక్షంగా సూర్య గ్రహణం చూడలేక పోయిన మోడీ
కోజికోడ్ మరి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లైవ్ ఫీడ్ ద్వారా సూర్య గ్రహణాన్ని వీక్షించినట్లు ప్రధాని పేర్కొన్నారు.సూర్య గ్రహణంపై తాను ఎన్నో విషయాలు ఈ రోజు తెలుసుకున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. ఈ విషయంలో నిష్ణాతులైన వ్యక్తులతో నేడు చర్చించినట్లు ఆయన తెలిపారు. మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది.