గొల్లపూడి డిసెంబర్ 27 (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం గొల్లపూడిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
దేవినేని ఆరెస్టు
రాజధానిని మార్చొద్దంటూ గొల్లపూడి-1 సెంటర్ వద్ద తెదేపా నేత దేవినేని ఉమ నిరసన చేపట్టారు. రైతులతోపాటు రహదారిపై ఉమ బైఠాయించారు. పోలీసులు దేవినేనితోపాటు పులువురు నేతలను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. దీంతో నిరసనకారులు పోలీసుల చర్యను నిరసిస్తూ ఆందోళనలను ఉద్ధృతం చేశారు.