చంద్రబాబుకు ఇంగ్లీషు రాదేమో - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చంద్రబాబుకు ఇంగ్లీషు రాదేమో

అమరావతి డిసెంబర్ 12, (way2newstv.com)
జీవో నెం.2430 రద్దు చేయాలని చంద్రబాబు అడగడం ఆశ్చర్యంగా ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు  గురువారం ఉదయం శాసనసభ లో . 2430 జీవోను రద్దు చేయాలన్న  టీడీపీ డిమాండ్పై సీఎం స్పందించారు. మీడియా స్వేచ్ఛను హరించేలా ఈ జీవోను తీసుకొచ్చారని... వెంటనే జీవోను రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ సందర్బంగా అసెంబ్లీలో 2430 జీవో చదివి వినిపించారు. 2430 జీవో ని చంద్రబాబు చదివారా..?..లేదా..? చంద్రబాబు ఒక్కసారి అయినా ఆ జీవో చదివారా అని జగన్ ప్రశ్నించారు. జీవోలో భావాన్ని చంద్రబాబు అర్థం చేసుకోవడంలో లోపం ఉందేమో. 
చంద్రబాబుకు ఇంగ్లీషు రాదేమో

చంద్రబాబు కి ఇంగ్లీష్ అర్థం కావడంలో లోపం ఉందేమోనని అన్నారు. 2430 జీవో రద్దు చేయాలన్న చంద్రబాబు ధోరణి ఆశ్చర్యంగా ఉంది. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కి కనీస జ్ఞానం కూడా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. మీడియా అన్యాయంగా ,ఆధారాలు లేకుండా వార్తలు రాసినా కామ్ గా ఉండాలా..? *తప్పుడు రాతలు వ్రాసే వారిపై పరువు నష్టం వేసే హక్కు కూడా ఉండదా..? ఆరోపణలు మోస్తూ అధికారులు ఉండాలా అని నిలదీసారు.ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కావాలని విమర్శలు చెయ్యడం తగదని అన్నారు. నాకు ఇంగ్లీష్ రాదని పదే పదే సీఎం అంటున్నారు. నేను వేంకటేశ్వర యూనివర్సిటీ లో చదివాను. జగన్ ఎక్కడ చదివారో చెప్తే అక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటానని అన్నారు. పేపర్లు పట్టుకుని వస్తే నన్ను చీఫ్ మార్షల్స్ తోసేశారు. చీఫ్ మార్షల్స్ పై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ప్రత్యేక హోదాపై మాట్లాదాం అనుకుంటే అసెంబ్లీలో గందరగోళం నెలకొల్పారు. ఆనాడు వైయస్ ఇచ్చిన జీవో వెనక్కి తీసుకున్నారని అన్నారు. అసెంబ్లీలో పులివెందుల పంచాయితీ చేద్దామనుకుంటే కుదరదని అయన అన్నారు.