నిర్భయ దోషుల ఉరి శిక్షను టీవీ ఛానల్స్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నిర్భయ దోషుల ఉరి శిక్షను టీవీ ఛానల్స్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలి

సుప్రీంలో సంచలన పిల్ దాఖలు
న్యూ ఢిల్లీ డిసెంబర్ 14   (way2newstv.com
నిర్భయ కేసు దోషుల ఉరిశిక్షకు కౌంట్ డౌన్ మొదలైంది. అధికారుల నుండి ఒక కచ్చితమైన డేట్ వెలువడకపోయినప్పటికీ   తలారి కోసం వెతుకులాట ఉరి తాళ్లను సిద్దం చెయ్యడం లాంటి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో  దోషులకు  త్వరలోనే మరణ శిక్ష ఖాయమని  ప్రచారం రోజురోజు కూ పెరిగి పోతుంది. అయితే నిర్భయ దోషుల ఉరి శిక్షకు సంబంధించి తాజాగా  సుప్రీంలో సంచలన పిల్ దాఖలైంది.  ఆ నలుగురు దోషులకు ఉరి వేయడాన్ని టీవీ ఛానల్స్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ  పిటిషనర్ కోరారు. అలాగే అమెరికాలో మాదిరిగా నిర్భయ పేరెంట్స్ సమక్షంలో దోషులను ఉరి తియ్యాలని ఆయన కోర్టును కోరారు. కాకపోతే ఉరి విషయంలో మరికొన్ని రోజులు జాప్యం జరిగేలా కనిపిస్తుంది.  
నిర్భయ దోషుల ఉరి శిక్షను టీవీ ఛానల్స్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలి

దోషిగా నిర్థారించబడిన  అక్షయ్  ఉరిశిక్ష పై సుప్రీంకోర్టు లో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17న ఈ పిల్పై వాదనలు జరగనున్నాయి. మిగిలిన ముగ్గురు దోషులు..పవన్ గుప్తా ముకేశ్ వినయ్ శర్మ గతంలోనే రివ్యూ పిల్స్ దాఖలు చేయగా..సుప్రీం వాటిని తిరస్కరించింది. ఇకపోతే గత కొన్ని రోజులుగా జైలు అధికారులు తలారి లేరు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడుఅధికారుల నుండి   ఆదేశాలు వస్తే 24గంటల్లోనే తీహార్ జైలుకు చేరుకొని నా డ్యూటీని నెరవేరుస్తా అని మేరఠ్కు చెందిన తలారీ పవన్ జలాద్ తెలిపారు.అయితే నిర్భయ హత్య కేసులో మొత్తం ఆరుగురిని దోషులు గా తేల్చారు. అక్షయ్ థాకూర్ ముఖేష్ సింగ్ వినయ్ శర్మ పవన్ గుప్తా రామ్ సింగ్ మొహమ్మద్ అఫ్రోజ్లను తేల్చారు. వారిలో రామ్ సింగ్ 2015లో జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక మైనర్ అయిన మొహమ్మద్ అఫ్రోజ్ జువైనల్ యాక్ట్ కింద మూడేళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చేశాడు. ఇప్పుడు మిగిలిన నలుగురికి ఉరి తీయబోతున్నట్లు సమాచారం.