ఖమ్మం డిసెంబర్ 14 (way2newstv.com)
;రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కొర్లగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ధాన్యం రైతులతో మాట్లాడారు. రైతు పండించే ప్రతి గింజకూ గిట్టుబాటు ధర కల్పించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకొంటున్నారని మంత్రి అన్నారు.
పండించే ప్రతి గింజకూ గిట్టుబాటు ధర: మంత్రి పువ్వాడ
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వి.కర్ణన్, జేసీ హనుమంత్ కోడింబా, ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.