కనుమూరిని చెక్ పెట్టేందుకు... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కనుమూరిని చెక్ పెట్టేందుకు...

ఏలూరు, డిసెంబర్ 10, (way2newstv.com)
స్తుత నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చెక్ పెట్టే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. గత కొంతకాలంగా రఘురామ కృష్ణంరాజు పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారు. ఆయన భారతీయ జనతా పార్టీ నేతలతో సన్నిహితంగా మెలగడమే కాకుండా, పార్టీ అనుమతి లేకుండా నిర్ణయాలు తీసుకుంటుండటం వైసీపీకి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ ఒకసారి రఘురామ కృష్ణంరాజుకు క్లాస్ పీకినా ప్రయోజనం లేకుండా పోయింది.ఢిల్లీలో వైసీపీకి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పెద్దదిక్కుగా ఉన్నారు. 
కనుమూరిని చెక్ పెట్టేందుకు...

పార్టీ వ్యవహారాలను, జగన్ ఢిల్లీ పెద్దల అపాయింట్ మెంట్లను ఆయనే చూసుకుంటారు. అయితే ఇటీవల కాలంలో రఘురామకృష్ణంరాజు విజయసాయిరెడ్డిని మించి ఢిల్లీలో లాబీయింగ్ చేసుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. అయితే తాను పార్టీ లైన్ ఎన్నడూ దాటలేదని, నియోజకవర్గ సమస్యల కోసమే కేంద్రమంత్రులను కలుస్తున్నానని రఘురామకృష్ణంరాజు వివరణ ఇచ్చుకుంటున్నారు.రఘురామకృష్ణంరాజుపై పార్టీపరంగా చర్యలు తీసుకునే అవకాశం లేదు. బీజేపీని కారణంగా చూపి రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకుంటే కేంద్రం నుంచి మరింత ఇబ్బందులను వైసీపీ అధినేత ఎదుర్కొనాల్సి వస్తుంది. అందుకే రఘురామకృష్ణంరాజుపై చూసీ చూడనట్లు వ్యవహరించాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తుంది. అయితే రఘురామ కృష్ణంరాజు విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం భవిష్యత్తులో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నరసాపురం విషయంలో ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తలు వైసీపీ తీసుకుంటోంది.అందులో భాగంగానే మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుమారుడు రంగారాజును పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించింది. నర్సాపురం పార్లమెంటు పరిధిలో కనుమూరి ఫ్యామిలీ కంటే బలంగా గోకరాజు కుటుంబం ఉంది. అందుకోసమే జగన్ గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజు పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రంగరాజును పార్టీలో చేర్చుకుంటే కొంత రఘురామ కృష్ణంరాజు దూకుడు తగ్గించే అవకాశముంది. అంతేకాకుండా తమకు ఆల్టర్నేటివ్ ఉన్నారన్న సంకేతాలను కూడా ఆయనకు పంపడంతో కొంత కట్టడి చేయవచ్చన్నది వైసీపీీ అధినేత వ్యూహంగా కన్పిస్తుంది.\