అనంతపురం డిసెంబర్ 21, (way2newstv.com):
ధర్మవరంలో వైఎస్సార్ నేతన్న నేస్తం పధకాన్ని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ప్రారంభించారు. సీఎం మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 4లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగామన్నారు. లక్షా 30వేల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇవ్వగలిగామని అన్నారు. ఆప్కో వ్యవస్థను ప్రక్షాళన చేసి చేనేత కార్మికులను ఆదుకుంటామన్నారు. అన్నగా నేతన్నల అండగా ఉంటాను.
నేతన్న నేస్తం ప్రారంభించిన సీఎం జగన్
ఒకొక్క చేనేత కుటుంబానికి 24 వేల రూపాయల సాయం అందిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 81 వేల మందికి సాయం అందుతుంది. పాదయాత్రలో చేనేతల కష్టాలు దగ్గర నుండి చూసాను. చేనేత కార్మికుల కష్టాలు నాకు బాగా తెలుసు. చేనేత కార్మికుల కన్నీళ్లు రాకుండా ఉండటమే నాలక్ష్యమని అన్నారు. చేనేత కార్మికుల సమస్యలపై ధర్నాలు, దీక్షలు చేశాం. నేతన్నల ను ఆర్ధికంగా ఆదుకోటానికే ఈ సాయం. ఆప్కోపై దర్యాప్తు జరుగుతోందని, మొత్తం ప్రక్షాళన చేస్తామన్నారు. నేరుగా బ్యాంక్ అకౌంట్లలోనే నగదు జమ చేస్తామన్నారు.25 లక్షల మంది పేదలకు ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు ఇస్తామని అన్నారు.