షాద్ నగర్ డిసెంబర్ 6, (way2newstv.com)
దిశ కేసులో నిందితుల నాలుగు మృతదేహాలు 20 నుంచి 30 అడుగుల దూరంలో పడి ఉన్నాయి. మృతదేహాలకు అక్కడే పంచనామా నిర్వహించామని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి శ్రీనివాస్ నాయక్ అన్నారు. గాంధీ ఆసుపత్రి నుండి ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ నిపుణులు, పంచనామాను పూర్తి చేసారు.
ఘటన స్థలంలోనే పంచనామా
తరువాత మృతదేహాలను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలంలో క్లూస్ టీమ్స్ తో పాటు, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పంచనామా జరిపారు. పోస్ట్ మార్టం కోసం నలుగురు ఎమ్మార్వో లు కి అప్పగించారు. ఫరూక్ నగర్, కుందూర్, నందిగామ, చౌదరి గూడ ఎమ్మారో లకు మృతదేహాలను అప్పగించారు.