రామ,లక్ష్మణుల్లో.. విభీషణుడైతే... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రామ,లక్ష్మణుల్లో.. విభీషణుడైతే...

విశాఖ టీడీపీలో చర్చ
విశాఖపట్టణం, డిసెంబర్ 24, (way2newstv.com)
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడితే చాలు మంటలు పుడతాయి. ఆయన పక్కా మాస్. ఆయన స్టైలే వేరుగా ఉంటుంది. అది చంద్రబాబు మీద అయినా జగన్ మీద అయినా ఆయన మాటల విసుర్లు ఒకేలా ఉంటాయి. తాజాగా అయ్యన్న మరో మారు పోలీసుల మీద నోరు చేసుకున్నారట. దాంతో ఆయన మీద కేసు పెట్టాల్సివచ్చిందని పోలీసులు చెబుతున్నారు. అయ్యన్న అసభ్య పదజాలంతో దూషించడం వల్లనే కేసు పెట్టామని నర్శీపట్నం పోలీసులు అంటున్నారు. ఇంతకీ అయ్యన్న ఏమన్నారు. ఎందుకు కేసులు పెట్టారంటే అదో ఇంటి కధగానే చెప్పాలి.అయ్యన్న రాముడైతే లక్షణుడుగా తమ్ముడు సన్యాసిపాత్రుడు ఉంటారన్నది నిన్నటి మాట. 
రామ,లక్ష్మణుల్లో.. విభీషణుడైతే...

ఇపుడు అదే తమ్ముడు విభీషణుడైపోయాడని పసుపు పార్టీ నేతలు ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు. అయ్యన్న తుదికంటా వ్యతిరేకించే వైసీపీలో తమ్ముడు సన్యాసిపాత్రుడు ఫ్యామిలీ మొత్తం చేరిపోవడంతో ఉమ్మడి ఇంటి మీద కొన్ని రోజుల క్రితం తొలిసారి వైసీపీ జెండా ఎగిరింది. ఓ వైపు పసుపు జెండా మరో వైపు ఫ్యాన్ జెండా చాలా బాగుంది రాజకీయం అని జనం ఎకసెక్కం ఆడే దాకా సీన్ వచ్చింది. ఇక ఆ గొడవలో పోలీసులు కూడా రంగంలోకి దిగిపోయారు.తన ఇంటికి ముందస్తు అనుమతి లేకుండా పోలీసులు రావడమేంటని అయ్యన్నపాత్రుడు గయ్యిమన్నారట. దాంతో పోలీసులతో ఆయన ఘాటుగా మాట్లాడమే కాదు, దూషణలు కూడా చేశారై, తమ విధులకు ఆటంకపరచారని అప్పట్లో జరిగిన ఘటనకు సంబంధించి తాజాగా కేసు పెట్టారు. దీంతో తమ్ముడే అన్న మీద కేసు బనాయించేలా చేశాడని అయ్యన్న వర్గం ఇపుడు రగిలిపోతోంది. ఇదంతా తప్పుడు కేసు అని, కావాలనే అయ్యన్నని మానసికంగా వేధిస్తున్నరని టీడీపీ తమ్ముళ్ళు అంటున్నారు. ఇక అయ్యన్న కొడుకు, ఆయన రాజకీయ వారసుడు విజయ్ పాత్రుడు అయితే తన తండ్రి మీద అధికారం ఉంది కదా అని వైసీపీ నేతలు కేసులు పెడుతున్నారని, పోలీసులను అడ్డుపెట్టుకుని అణగదొక్కాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.తాజా కేసుతో పాటు గతంలో కూడా అయ్యన్న మీద ఆరోపణలు ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. ఆయన మాటకు వస్తే చాలు పోలీసుల మీద గట్టిగా నోరు చేసుకుంటారని అంటున్నారు. విశాఖలో మరో జేసీ దివాకరరెడ్డిలా అయ్యన్న కూడా ఖాకీల మీద పెద్ద నోరు చేసుకుంటారని కూడా విమర్శిస్తున్నారు. మొత్తానికి ఇన్నాళ్ళూ వీధుల్లో టీడీపీ నేతలతో పోరాడుతూ వస్తున్న అయ్యన్నకు ఇపుడు ఇంట్లో తమ్ముడు రాజకీయ శత్రువు అయ్యాడు. ఫలితంగా పోలీసు కేసు కూడా నమోదు అయింది. తొందరలో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. అక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి మరి.