ట్రిపుల్ తలాఖ్, విడాకులు పొందిన ఇతర మహిళలకు పునరావాసం

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం
లక్నో డిసెంబర్ 28 (way2newstv.com)
ట్రిపుల్ తలాఖ్ బాధిత మహిళలతో పాటు భర్తల నుంచి విడాకులు పొందిన ఇతర మతాల మహిళలకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సర్కారు శుభవార్త వెల్లడించింది. ట్రిపుల్ తలాఖ్ పొందిన వివాహితలకు పునరావాసం కల్పించేందుకు వీలుగా ఒక్కొక్కరికి 2020 నుంచి ఏటా ఆరువేల రూపాయల ఆర్థికసాయం అందిస్తుందని యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా ప్రకటించారు.దీంతోపాటు ట్రిపుల్ తలాఖ్ బాధిత మహిళలకు ప్రభుత్వం నుంచి ఉచిత న్యాయసహాయం అందిస్తామని సీఎం వెల్లడించారు. 
 ట్రిపుల్ తలాఖ్, విడాకులు పొందిన ఇతర మహిళలకు పునరావాసం

ట్రిపుల్ తలాఖ్ పొందిన ముస్లిమ్ మహిళలు 5వేల మందికి ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.దీంతోపాటు ఇతర మతాల్లో విడాకులు పొందిన మహిళలకు కూడా ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించాలని సీఎం నిర్ణయించారు. ట్రిపుల్ తలాఖ్ పొందిన మహిళలు పెట్టిన కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లను ఇస్తే చాలు ఈ పథకం కింద సర్కారు ఆర్థికసాయం అందజేయనుంది
Previous Post Next Post