వైసీపీ ఎంపీలకు.. చేదు అనుభవం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వైసీపీ ఎంపీలకు.. చేదు అనుభవం

విజయవాడ, డిసెంబర్ 18 (way2newstv.com)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ఇస్తున్న తొలి విందు ఆ పార్టీ ఎంపీలకు చేదు మిగిల్చింది. ఈ విందు కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే పరిమితమని కచ్చితంగా సీఎంవో ఆఫీస్ చెప్పేసిందట. నిజానికి మొదట ఎంపీలను కూడా ఈ విందుకు ఆహ్వానించాలని నిర్ణయించినా కూడా తరువాత నో చెప్పేశారట. ఎందుకంటే 151 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, జిల్లాల అధికారులు ఇలా ప్రతీ జిల్లాతోను జగన్ డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవడానికే ఎక్కువ సమయం అవుతుంది. దాంతో ఎంపీల గోడు వినేందుకు పెద్దగా టైం ఉండదని అంటున్నారు. పైగా దీని లక్ష్యం కూడా వేరు అని చెబుతున్నారు.జగన్ అధికారంలో ఉన్నారు. ఆయన పై లెవెల్లో నిర్ణయాలు తీసుకుంటారు. కానీ దిగువ స్థాయిలో అమలుకాకపోతే ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుంది. 
వైసీపీ ఎంపీలకు.. చేదు అనుభవం

అందువల్లనే జగన్ క్షేత్ర స్థాయిలో అధికారులను కూడా తనతో కలసి నడిపించడానికే ఈ విందు ఏర్పాటు చేశారని అంటున్నారు. వారితో నేరుగా ఇంటరాక్ట్ కావడం ద్వారా వారి సాధక బాధకాలను కూడా జగన్ తెలుసుకుంటారు. పధకాల అమలులో ఉన్న సమస్యలు కూడా అధికారులు నుంచి జగన్ తెలుసుకునే వీలు ఉంటుందిఇక జగన్ పార్టీలో 70 మంది ఎమ్మెల్యేలు ఇప్పటివరకూ ముఖ్యమంత్రిని నేరుగా కలవలేకపోయారు. వారితో దూరం పెరిగిందని అన్న ప్రచారం కూడా సాగుతోంది. దీనికి చెక్ పెట్టడానికే జగన్ విందు ఏర్పాటు చేశారని అంటున్నారు. దీనివల్లా ఎమ్మెల్యేలు సైతం తమ అభిప్రాయాలను సూటిగా సీఎం కి చెప్పుకునే వీలు ఉంటుంది. అదే విధంగా అధికారులతో కూడా ఎమ్మెల్యేలు ఇంటరాక్ట్ కావడం వల్ల సమస్యలకు సత్వర పరిష్కారం లభించే వీలు ఉంటుంది. జగన్ సైతం తన ఆలోచనలు ఎమ్మెల్యేలతో పంచుకుని వారి అభిప్రాయలను కూడా తెలుసుకునే వీలు ఉంటుంది.అధికారులతో మంచి అయినా చెడ్డా అయినా ఒక ప్రభుత్వానికి వస్తుంది. అధికారులు సక్రమంగా పనిచేస్తేనే పాలకులకు కూడా కీర్తి దక్కుతుంది. అందువల్ల ఆ గ్యాప్ ని లేకుండా చూసుకోవడంతో పాటు కొత్త ప్రభుత్వానికి ఏం కావాలి. అధికారులకు ప్రభుత్వం నుంచి ఏం కావాలి అన్నది తెలుసుకోవడమే జగన్ ముఖ్య ఉద్దేశ్యంగా ఉందని అంటున్నారు. ఈ విందు వల్ల జగన్ ఆరు నెలల పాలన మరింతగా గాడిలో పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జగన్ వ్యూహాత్మకంగానే ఈ విందుని ఏర్పాటు చేశారని చెబుతున్నారు.ఇక ఎంపీలకు ఢిల్లీలో తొందరలోనే విందు ఏర్పాటు చేయడానికి జగన్ నిర్ణయించారని కూడా చెబుతున్నారు. 24 మంది ఎంపీలు ఉభయ‌ సభల్లో వైసీపీకి ఉన్నారు. వారు తమకు సరైన గుర్తింపు లేదని ఆవేదన చెందుతున్నారు. వారితో ముఖ్యమంత్రి ఇంటరాక్ట్ కావడం ద్వారా సన్నిహితం పెంపొందించుకోవాలని చూస్తున్నారు. ఇక ఎంపీల పనితీరు కూడా గమనించడమే కాకుండా వారికి దిశానిర్దేశం చేయడానికి జగన్ ఎంపీల విందుని ఉపయోగించుకుంటారని అంటున్నారు. ఢిల్లీలో ఈ విందు ఏర్పాటు చేయడం వెనక మరో ఉద్దేశ్యం కేంద్ర సమస్యలపైన సంబంధిత అధికారులతో ఇంటరాక్ట్ అవుతూ ఏపీ సర్కార్ కి ప్రయోజనం చేకూరేలా చేస్తారని, చేయాలని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.