ఏపీ సీఎం మాత్రమే అన్న : రోజా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీ సీఎం మాత్రమే అన్న : రోజా

విజయవాడ, డిసెంబర్ 9 డిసెంబర్ 9  (way2newstv.com)
ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని వెంటనే శిక్షిస్తేనే భయం వస్తుంది అన్నారు రోజా. ఏపీలో గన్ కంటే ముందు జగన్ ఉంటారనే నమ్మకం కలగాలని.. ఆడపిల్ల జోలికి వస్తే.. వెన్నులో వణుకు పుట్టేలా చట్టం తేవాలని కోరుతున్నాను అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఆడవాళ్ల ప్రదేశ్‌గా మారాలి అన్నారు. ఏ ఆడపిల్లకు రక్షణ లేకపోతే ఏపీకి వస్తే రక్షణ ఉంటుంది అనే పరిస్థితి రావాలి అని అభిప్రాయపడ్డారు.ఏ రాష్ట్రంలో సీఎంను అన్న అని పిలవరని.. ఈ రాష్ట్రంలో మాత్రం జగన్‌ను మాత్రం అన్న అని పిలవగలరు అన్నారు రోజా.హోంమంత్రి పదవి దళిత మహిళకుడిప్యూటీ సీఎం ఎస్టీ మహిళకు కేటాయించారని గుర్తు చేశారు. 
ఏపీ సీఎం మాత్రమే అన్న : రోజా

జగన్ అన్నకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. ఆ ఆడపిల్లల్ని, చెల్లిని, భార్య, తల్లిని గౌరవిస్తారని.. కాబట్టే మహిళలందరూ జగనన్న అసెంబ్లీ నుంచి ఏ చెబుతారని ఎదురు చూస్తున్నారన్నారు. ఒకరు 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారని.. తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటే వాళ్లను కాపాడటానికి తనను ఏడాది పాటూ సస్పెండ్ చేశారని గుర్తు చేశారు.ఆడపిల్లల కోసం ఈ ఆరు నెలల్లో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని.. మహిళలపై అఘాయిత్యాలు చేస్తే 24 గంటల్లో నిందితుల అరెస్ట్ చేస్తున్నారన్నారు. మద్యాన్ని కూడా దశలవారీగా దూరం చేస్తున్నారని.. మహిళల కోసం 112 టోల్ ఫ్రీ నెంబర్ 118 కూడా వాట్సాప్ నెంబర్ కూడా తీసుకొచ్చామన్నారు. జీరో ఎఫ్‌ఐఆర్ తీసుకొచ్చామని.. ఇలా మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారని.. మహిళల భద్రతకు సంబంధించి సైరా జగన్‌మోహన్‌రెడ్డి అనేలా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం అన్నారు.