మళ్లీ యాక్టివ్ గా గల్లా అరుణ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మళ్లీ యాక్టివ్ గా గల్లా అరుణ

తిరుపతి, డిసెంబర్ 16, (way2newstv.com)
గల్లా అరుణకుమారి. సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా బాధ్యతలను నిర్వహించి దీర్ఘకాలం ఆ పార్టీలోనే ఉన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి వరసగా విజయం సాధించిన గల్లా అరుణకుమారి తన వారసుడు ఎంట్రీతో రాజకీయాలను పూర్తిగా వదిలేసినట్లేనని అంటున్నారు. చంద్రబాబు పుట్టిన నియోజకవర్గమైన చంద్రగిరిలో గల్లా అరుణకుమారికి మంచి గ్రిప్ ఉంది. గల్లా ఫ్యామిలీ రాజకీయంగానే కాకుండా పారిశ్రామికంగా ఆ ప్రాంతంలో బలంగా ఉండటంతో ప్రత్యేక ఓటు బ్యాంకు కూడా బాగానే ఉంది.అయితే 2014 ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత గల్లా అరుణ కుమారి చంద్రగిరికి దాదాపుగా దూరమయ్యారనే చెప్పాలి. 
 మళ్లీ యాక్టివ్ గా గల్లా అరుణ

దీంతో పాటు తనయుడు గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంటు సభ్యుడు కావడం కూడా రాజకీయాలకు దూరం జరగడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో చంద్రగిరి టిక్కెట్ కూడా పులివర్తి నానికి చంద్రబాబు కేటాయించారు. గల్లా గత ఎన్నికల్లో నాని విజయానికి మనస్పూర్తిగా పనిచేయలేదనే చెప్పాలి. ఓటమి తర్వాత గల్లా అరుణకుమారి గుంటూరులోనూ, తన వ్యాపారాల కోసము ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.2019 ఎన్నికల ఓటమి తర్వాత చంద్రగిరికి గల్లా అరుణకుమారి పూర్తిగా దూరమయ్యారు. గల్లా జయదేవ్ పార్లమెంటు సభ్యుడయిన తర్వాత చంద్రగిరికి మరింత దూరమయ్యారు. అడపా దడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ యాక్టివ్ గా లేరని మాత్రం చెప్పాలి. గల్లా అరుణకుమారి ఇప్పటికే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చంద్రబాబుతో చెప్పారు. తనకు పార్టీ పదవి కూడా వద్దని గల్లా అరుణకుమారి సూచించినప్పటికీ ఆమెకు కొన్ని కారణాల రీత్యా పదవి ఇచ్చారు.చంద్రగిరి నియోజకవర్గంలో మూడుసార్లు వరస విజయాలు సాధించిన గల్లా అరుణకుమారి తాను చంద్రగిరికి దూరమయ్యానన్న బాధ ఎంతో ఉంది. తనను చంద్రగిరి ఇన్ ఛార్జి నుంచి తప్పించాలని గల్లా అరుణకుమారి చెప్పినప్పటికీ ఆమెకు అక్కడే మళ్లీ విజయం సాధించాలని పట్టుదల ఉంది. కానీ చంద్రగిరిలో పులవర్తి నానితో పాటు టీడీపీ నేతలు సహకరించడం లేదు. ఇటీవల తన అనుచరులతో సమావేశమైన గల్లా అరుణకుమారి చంద్రగిరిలో తిరిగి పట్టునిలుపుకోవాలన్న మనసులో మాట చెప్పేశారట. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లాలని యోచిస్తున్నారు.