విశాఖపట్నం డిసెంబర్ 28(way2newstv.com):
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖలో పర్యటించారు. .అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదన చేసిన అనంతరం తొలిసారిగా నగర పర్యటనకు వచ్చిన సీఎం జగన్ కు ఘనస్వాగతం లభించింది. విశాఖ విమానాశ్రయం నుంచి కైలాసగిరి, ఆర్కే బీచ్ లోని విశాఖ ఉత్సవ్ వేదిక వరకూ దాదాపు 24 కిలోమీటర్ల మేర భారీ మాన వహారం నిర్వహించారు.
సీఎం జగన్ కు ఘనస్వాగతం
మార్గం మధ్యలో సీఎం జగన్ కు ప్రజలు అభినందనలు తెలియజేశారు. కృతజ్ఞత పూర్వక స్వాగతం లభించింది. సీఎం కాన్యాయ్ పై పూల వర్షం కురిపించారు. ప్లకార్డు లు, జెండాలు పట్టుకొని సీఎం జగన్ కు అపూర్వ స్వాగతం పలి కారు.మరోవైపు ఆర్కే బీచ్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.
Tags:
Andrapradeshnews