నాగబాబు కొత్త షో - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నాగబాబు కొత్త షో

హైద్రాబాద్, డిసెంబర్ 19 (way2newstv.com)
అదిరింది’ అంటూ తండ్రీకూతుళ్లు నాగబాబు, నిహారికలు రచ్చ మొదలుపెట్టేశారు. జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసిన నాగబాబు జీ తెలుగులో ‘అదిరింది’ అనే కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం నుండి ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ సంబంధించి ‘మాటల్లేవ్.. మాట్లాడుకోడాల్లేవ్’ అంటూ ప్రోమోను విడుదల చేశారు. తాజాగా బుధవారం నాడు మరో ప్రోమోను విడుదల చేస్తూ షో ఎలా ఉండబోతుందో హింట్ ఇవ్వడమే కాకుండా యాంకర్ ఎవరు? నాగబాబు పక్కన జడ్జిగా ఉండబోయేది ఎవరు? ఏయే టీంలు ఉండబోతున్నాయి? అసలు అదిరింది కాన్సెప్ట్ ఏంటి? అన్న ప్రశ్నలకు సమాధానం ఇస్తూ నాలుగున్నర నిమిషాలు ప్రోమోను విడుదల చేశారు.
నాగబాబు కొత్త షో

గ్లామరస్ హోస్ట్ అంటూ యాంకర్ సమీరా ‘అదిరింది’ అంటూ హొయలొలికిస్తుంది. ఇక జడ్జిగా నాగబాబు అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి.. నా ఎంట్రీనే కాదు.. షో కూడా అదిరిపోద్ది చూస్తుండు అంటూ సెటైర్లు మొదలు పెట్టారు.ఇక మెగా డాటర్ నిహారిక సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి నాగబాబు పక్కన పకా పకా నవ్వడానికి జడ్జి చైర్‌లో సెటిల్ అయిపోయింది. నన్ను స్పెషల్ గెస్ట్ అనొద్దు.. ఇది నా ఫ్యామిలీ.. ఎంతమంది ఉన్నారన్నది కాదు.. ఎవరున్నారన్నదే ముఖ్యం అంటూ తండ్రిబాటలోనే జబర్దస్త్‌ షోపై సెటైర్లు వేయడం మొదలుపెట్టింది.ఇక టీం లీడర్లుగా ధనరాజ్, వేణు, ఆర్పీ, చమ్మక్ చంద్ర కామెడీ చేసేందుకు బాగానే కష్టపడుతున్నారు. మొత్తంగా నాగబాబు నవ్వులు, టీం లీడర్ స్కిట్‌‌లు, యాంకర్ కవ్వింతలు అన్నీ జబర్దస్త్ షోకి జిరాక్స్ కాపీలా కనిపిస్తున్నాయి. అవే పంచ్‌లు అవే పాత ముఖాలు అదే దర్శకులు కావడంతో కొత్తదనం పెద్దగా కనిపించడం లేదు. చూడాలి మరి నాగబాబు అన్నట్టు ‘అదిరింది’ జబర్దస్త్‌ని మించి అదరగొడతారో లేక ప్రేక్షకుల్ని బెదరగొడతారో.