విజయవాడ, డిసెంబర్ 24, (way2newstv.com)
డీపీ అధినేత చంద్రబాబు స్టాండ్ తీసుకున్నారు. అమరావతి ఇక్కడే ఉండాలని ఆయన తన పార్టీ తరుపున నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ నేతలతో చర్చించిన తర్వాత చంద్రబాబు నేరుగా అమరావతికి వెళ్లి రైతులకు సంఘీభావం తెలిపారు. తాను కలలు కన్న రాజధాని అమరావతిలోనే ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. న్యాయస్థానంలోనైనా పోరాడి అమరావతి ఇక్కడే ఉండేందుకు టీడీపీ గట్టిగా ప్రయత్నిస్తుందని తెలిపారు.ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెచ్చిన సంగతి తెలిసిందే.రాజధాని రైతులకు టీడీపీ అధినేత చంద్రబాబు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు తుళ్లూరులో ఆందోళన చేస్తున్న రైతులకు అండగా నిలచారు.
అమరావతిపై బాబు క్లియర్
తన మీద వ్యక్తిగత కక్షతోనే అమరావతిని చంపేస్తున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అన్ని హంగులు ఉన్న అమరావతిని కాదంటున్నారంటే ఇందులో కక్ష తప్ప మరేదేమీ లేదన్నారు. భూముల కొనుగోళ్లలో అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలే కాని ఇలా అమరావతిని చంపేయడమేంటని ప్రశ్నించారు. మూడు రాజధానులను తాను ఎక్కడా చూడలేదని, రాజ్యంగంలోనూ చదవలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తాను రాజధాని అమరావతి రైతులకు అండగా ఉంటానని తెలిపారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతిలో లెజస్లేచర్ క్యాపిటల్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రాజధానిపై నియమించిన జీఎన్ రావు కమిటీ సయితం దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల టీడీపీ నేతలు జగన్ ప్రతిపాదనను స్వాగతించినా చంద్రబాబు మాత్రం మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించారు.తుళ్లూరులో ప్రసంగించిన చంద్రబాబు న్యాయం, ధర్మమే చివరకు గెలుస్తుందన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడితే జ్యుడిషియల్ కమిషన్ వేసి చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. రాజధాని మార్చడమేంటని ఆయన ప్రశ్నించారు. జీఎన్ రావు కమిటీ అసలు ఎక్కడ పర్యటించిందని తెలిపారు. అమరావతి రైతులు రాష్ట్ర ప్రధమ పౌరులుగా ఉండాలని తాను భావించానన్నారు. తొమ్మిది నగరాలను ఇక్కడ ఏర్పాటు చేసి రాష్ట్ర భవిష్యత్తులకు పునాదులు వేశామన్నారు.జగన్ ఇష్టారాజ్యమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్నారు.విశాఖను ఆర్థిక రాజధానిగా, టెక్నికల్ హబ్ గా అభివృద్ధి చేయాలన్నారు. మనదంతా ఒకేటే పార్టీ అని, అది అమరావతి పార్టీ అని చంద్రబాబు అన్నారు. అయితే చంద్రబాబు నిర్ణయం పార్టీలో కొంత గందరగోళం ఏర్పడిందనే చెప్పాలి. అమరావతిపై చంద్రబాబు స్టాండ్ తీసుకోవడంతో మిగిలిన ప్రాంతాల నేతలు ఎలా వ్యవహరిస్తారో అన్నది చూడాలి.