వ్యవసాయ రంగంలో మార్కెటింగ్ లేదు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వ్యవసాయ రంగంలో మార్కెటింగ్ లేదు

హైదరాబాద్ డిసెంబర్ 23, (way2newstv.com):
మహిళా రైతు ఉత్పత్తిదారుల  భాగస్వామ్యంతో సెర్ఫ్ సహకారంతో ఏర్పాటయిన మహిళా సంఘాలు నిర్వహించే బేనిషాన్ కంపెనీ ప్రారంభోత్సవానికి న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,  పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హజరయ్యారు. వ్యవసాయ మంత్రి మాట్లాడుతూ దేశం మరచిపోతున్న రైతును తెలంగాణ గుర్తుచేసింది. - మనది వ్యవసాయిక రాష్ట్రం.  కేసీఆర్ తన నిర్ణయాలతో గత ఆరేళ్లలో వ్యవసాయం చేసి బతకగలమన్న నమ్మకాన్ని రైతులకు ఇచ్చారు.  ముఖ్యమంత్రి కేసీఆర్  గొప్ప దార్శనికులు. భవిష్యత్ తరాలకు మనం ఏం చేస్తున్నాం అన్న కలతోనే వారు నిరంతరం పనిచేస్తుంటారని అన్నారు.  
వ్యవసాయ రంగంలో మార్కెటింగ్ లేదు

మానవశక్తిని సమర్థవంతంగా వాడుకోకుంటే అంతకన్నా నిరర్దకం ఏదీ లేదన్నది అయన ఉద్దేశం.  నాణ్యమైన ఉత్పత్తులు ప్రజలకు చేరాలంటే లక్షలాదిగా ఉన్న మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలన్న ఆలోచన కేసీఆర్  మదిలో ఉంది.  తెలంగాణలో అన్ని రకాల పంటలు పండుతాయి.  దేశంలో వ్యవసాయానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న మద్దతు మరే రాష్ట్రం ఇవ్వడం లేదని అన్నారు.  రైతు బందు, రైతుభీమా, ఉచిత కరంటు, రుణమాఫీ వంటివి మరే రాష్ట్రం అమలు చేయడం లేదు.  రైతు పండించిన పంటకు మద్దతుధర కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది.  రాష్ట్ర అవసరాలతో పాటు దేశ ఆహార అవసరాలు తీర్చే అవకాశం తెలంగాణకే ఉంది.  రైతులు తమ పంటలకు న్యాయమైన ధర పొందేందుకు బేనిషాన్ సంస్థ ఉపయోగపడుతుందని అన్నారు.  మహిళా రైతులతో రైతు దినోత్సవం నాడు ఈ సంస్థను ప్రారంభించడం శుభసూచకం.  కేసీఆర్ ముందుచూపుతో దేశమంతా రైతుల వైపు చూస్తుంది.  కేంద్రంలో కదలిక వచ్చి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ప్రవేశపెట్టింది.  బేనిషాన్ సంస్థ ఎదిగి కూరగాయలు, పండ్లు మాత్రమే కాకుండా మాంసం కేంద్రాలపై దృష్టి సారించాలి.  నాణ్యమైన సేవలు, కల్తీలేని పదార్ధాలు ప్రజలకు అందించాలి.  అప్పుడు ప్రజలు మీ ఉత్పత్తుల కోసం ఎగబడతారు.  హోంమంత్రి మహమూద్ అలీ  స్ఫూర్తితో హర్యాన వెళ్లి బర్రెలు తీసుకొచ్చాం.  గ్రామాలలో మార్కెటింగ్ వ్యవస్థ లేక రూ.40 లక్షలు నష్టపోయి బర్రెలు అమ్మాల్సి వచ్చింది.  నాణ్యమైన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునే సదుపాయం రైతులకు లేదు అందుకే నష్టపోతున్నారు.  ఆ కొరత తీర్చగలిగితే బేనిషాన్ సంస్థ విజయవంతమైనట్లేనని అన్నారు. సోమవారం నాడు  తాజ్ డెక్కన్ లో  జరిగిన ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్ధసారధి,  ప్రభుత్వవిప్ గొంగిడి సునిత తదితరులు హజరయ్యారు.