నన్ను ప్రత్యేక సభ్యునిగా చూడండి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నన్ను ప్రత్యేక సభ్యునిగా చూడండి

గన్నవరం ఎమ్మెల్యే వంశీ
అమరావతి డిసెంబర్ 10, (way2newstv.com)
ఏపీ శాసనసభ సమావేశాలు రెండవరోజు మంగళవారం ప్రారంభమయ్యాయి.  గన్నవరం ఎమ్యెల్యే వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవటంపై వివరణ ఇచ్చారు. నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం ను కలిసాను. సీఎం ను కలవటంతో నన్ను టీడీపీ సస్పెండ్ చేసింది.సీఎంను కలవటం ఇదే తొలిసారి కాదు ప్రజా సమస్యలపై చాలా సార్లు కలిశానని అన్నారు. 
నన్ను ప్రత్యేక సభ్యునిగా చూడండి

వంశీ ప్రసంగానికి టీడీపీ సభ్యులు పలుసార్లు అడ్డం పడ్డారు. టిడిపిలో ఇమడలేక బయటకు వచ్చా. నన్ను ప్రత్యేక సభ్యునిగా చూడండి. సభలో నా హక్కులను కాపాడాలని కోరుకుంటున్నానని అన్నారు.  పేదల కోసం వైఎస్ ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చారని వంశీ కొనియాడారు. పోలవరం కుడికాలువపై మోటార్ల విషయం, ఇంగ్లీష్ మీడియం.. తదితర పథకాలు తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరతపై తన అభ్యంతరాలను టీడీపీ పట్టించుకోలేదని విమర్శించారు.