ఇలియానాకు మంచి చాన్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇలియానాకు మంచి చాన్స్

ముంబై, డిసెంబర్ 17 (way2newstv.com)
ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన గోవా బ్యూటీ ఇలియానాకు ఇటీవల కాలం అస్సలు కలిసి రావటం లేదు. బాలీవుడ్‌ మీద ఆశలతో సౌత్‌ సినిమాను పక్కన పెట్టి ఈ బ్యూటీ అక్కడ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేకపోయింది. దీంతో నార్త్‌లోనూ అవకాశం తగ్గిపోయాయి.అదే సమయంలో ఇలియానా వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంది. విదేశీ ఫోటోగ్రాఫర్‌ ఆండ్రూతో కొంతకాలం ప్రేమాయణం నడిపిన ఈ భామ అనూహ్యంగా అతనితో విడిపోయింది. ఆ సమయంలో తను మానసికంగా శారీరకంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది ఇలియానా.
ఇలియానాకు  మంచి చాన్స్

ఆ డిప్రెషన్‌ నుంచి ఈ మధ్యే బయటకు వచ్చిన ఈ భామ ప్రస్తుతం సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. చాలా కాలం తరువాత తెలుగులో అమర్‌ అక్బర్‌ ఆంటొని సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో ఇలియానా అవకాశం ఇచ్చేవాళ్లే కరువయ్యారు.ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ ఇలియానాకు పెద్దగా అవకాశాలు లేవు. ఒకటి రెండు సినిమాల్లో ఏ మాత్రం ప్రాధాన్యం లేని పాత్రల్లో నటిస్తుంది ఈ బ్యూటి. అయితే ఈ సమయంలో ఈ భామకు ఓ స్టార్‌ హీరో సరసన అవకాశం వచ్చింది. కోలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఓ టాప్‌ స్టార్‌ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా నటించనుంది.కోలీవుడ్‌ టాప్‌ హీరో అజిత్‌ హీరోగా ఖాకీ ఫేం హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వాలిమై పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో ఇలియానాకు అవకాశం వచ్చింది. ముందుగా ఈ పాత్రకు యామీ గౌతమ్‌ను తీసుకోవాలని భావించినా ఫైనల్‌గా ఇలియానాను తీసుకున్నారు చిత్రయూనిట్‌. మరి ఈ సినిమాతో అయిన ఇలియానా కెరీర్‌ గాడిలో పడుతుందేమో చూడాలి.