డమ్మీగా పార్టీ అధ్యక్షుడు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

డమ్మీగా పార్టీ అధ్యక్షుడు

శ్రీకాకుళం, డిసెంబర్ 10, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీని జాతీయ స్థాయిలో నిలబెట్టాలని అధినేత చంద్రబాబు టీడీపీని జాతీయ పార్టీగా మార్చి తాను జాతీయ అధ్యక్షుడుగా ఉన్నారు. పార్టీ అధికారంలో ఉండ‌గానే ఏపీ అధ్యక్షుడుగా సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావుని నియమించారు. అటు పార్టీ అడ్రస్ లేని తెలంగాణలో ఎల్.రమణ అధ్యక్షుడుగా ఉన్నారు. అయితే తెలంగాణలో చంద్రబాబు లేరు కాబట్టి రమణ ఏదోవిధంగా నామ‌మాత్రంగా అయినా అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఏపీలో మాత్రం కళా వెంకట్రావు అధ్యక్షుడు అని ఎవరికి పెద్దగా తెలియదు. పైగా పేరుకు మాత్రమే ఆయన అధ్యక్షుడు అయిన మొత్తం చంద్రబాబు, లోకేశ్ చేతుల్లోనే పార్టీ నడుస్తుంద‌న్నది జ‌గ‌మెరిగిన స‌త్యం.
డమ్మీగా పార్టీ అధ్యక్షుడు

అసలు కళా వెంకట్రావు అధ్యక్షుడు కాకుండా ఉండి ఉంటే ఆయనకు మంత్రిగా ఉన్నప్పుడు కాస్తో కూస్తో పేరు వ‌చ్చేదేమో. అయితే అటు పార్టీ ప‌గ్గాలు ఆయ‌న చేతుల్లో ఉన్నా ఆయ‌న‌కు అటు మంత్రిగాను.. ఇటు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగాను పేరు రాలేదు. ఎక్కడైనా అధ్యక్షుడుగా ఉంటే వారు ఎన్నికల్లో పోటీ చేస్తే దాదాపు విజయం సాధించాలి. కానీ క‌ళా వెంకట్రావు మొన్న ఎన్నికల్లో ఎచ్చెర్లలో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పటికే వ‌య‌స్సు పైబ‌డ‌డంతో క‌ళా రాజ‌కీయం జీవితం దాదాపు ముగిసిన‌ట్టే క‌నిపిస్తోంది.క‌ళా వెంకట్రావు టీడీపీలోనే తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. ఎన్టీఆర్ పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరి 1983 ఎన్నికల్లో తొలిసారి ఉణుకూరు (నియోజకవర్గాల పునర్విభజనకు ముందు) నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వరుసగా 1985, 1989 ఎన్నికల్లో టీడీపీ తరపున విజయం సాధించారు. ఎన్టీఆర్ హయాంలో పురపాలక, వాణిజ్య, హోం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే, 1994 ఎన్నికల్లో ఓడిపోవడంతో 1997లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తిరిగి 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కళా వెంకట్రావు విజయం సాధించారు. ఇక, 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎచ్చెర్ల నుంచి పోటీచేసి ఓటమి చూశారు.పీఆర్పీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో తిరిగి 2012తో సొంతగూటికి చేరుకున్నారు. 2014 ఎన్నిక‌ల్లో గెలిచారు. రాష్ట్ర విభజన జరగడంతో ఏపీ అధ్యక్షుడు అయ్యాడు. అధ్యక్షుడు అయిన ఆయన మాత్రం ఇప్పటికి డమ్మీగానే ఉండిపోయారు. ఏదో అప్పుడప్పుడు అధ్యక్ష హోదాలో లేఖలు విడుదల చేయడం తప్ప ఈయనకు పెద్ద పని లేకుండా పోయింది. అధ్యక్షుడు అంటే చంద్రబాబుతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలి. కానీ అలాంటిదేమీ జరగడం లేదు.మరి ఇలా ఉన్నప్పుడు చంద్రబాబు అధ్యక్ష బాధ్యతలు ఎందుకు అప్పగించారో తెలియదు. అటు శ్రీకాకుం జిల్లా రాజ‌కీయాల్లో అచ్చెన్నాయుడు ఎప్పుడూ క‌ళా వెంకట్రావు మాట నెగ్గనిచ్చే ప‌రిస్థితి లేదు. ఇక జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న గౌతు శిరీష‌, క‌న ర‌వికుమార్‌, రామ్మోహ‌న్‌నాయుడు లాంటి నేత‌ల దూకుడుతో క‌ళా వెంకట్రావు జిల్లా రాజ‌కీయాల్లో కూడా వెన‌క‌ప‌డిపోయారు. మొత్తానికైతే కళా వెంకట్రావు డమ్మీ అధ్యక్షుడుగా ఉండిపోయార‌నే చెప్పాలి.