అమరావతి భూములు కొనుగోలు పై బాంబు పేల్చిన కత్తి మహేష్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అమరావతి భూములు కొనుగోలు పై బాంబు పేల్చిన కత్తి మహేష్

విజయవాడ డిసెంబర్28  (way2newstv.com)
వివాదాస్పద రివ్యూ రైటర్ కత్తి మహేష్ సోషల్ మీడియా సాక్షిగా అమరావతి పరిధిలో భూములు కొనుగోలు పై బాంబు పేల్చారు.అయితే ప్రభుత్వం అధికారికంగా వీరి లిస్ట్ ను బయట పెట్టలేదు.ఇందులో టీడీపీ నేతల పేర్లను ఎవరు ఎంత కొన్నారో సవివరంగా బయటపెట్టి సంచలనం సృష్టించారు. క్విడ్ ప్రోకో పేరిట రాజధాని ప్రాంతం లో టీడీపీనేతలు వారి బినామీలు కొన్న భూముల వివరాలను పోస్ట్ చేసి దుమారం రేపారు. ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్- రాజధాని భూ దోపిడీ’ అంటూ కత్తి మహేష్ విడుదల చేసిన భూ దోపిడీ లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.ఆ లిస్ట్ లో మాజీ మంత్రి నారాయణ ఏకం గా 432 కోట్లతో 3129 ఎకరాలు కొన్నట్టు ఉంది. 
అమరావతి భూములు కొనుగోలు పై బాంబు పేల్చిన కత్తి మహేష్

ఇక నారా లోకేష్ 50 కోట్లు పెట్టి 500 ఎకరాలు పత్తిపాటి 196 ఎకరాలు సుజనాచౌదరి 700 ఎకరాలు రావెల కిషోర్ బాబు 55 ఎకరాలు మురళీమోహన్ 53 ఎకరాలు శ్రీధర్ బాబు 42 ఎకరాలు కోడెల శివరామ్ 17.3 ఎకరాలు దూళిపాల్ల 50 ఎకరాలు పయ్యావుల కేశవ్ 4.09 ఎకరాలు లింగమనేని రమేశ్ 804 ఎకరాల భూమి కొన్నట్టు లిస్ట్ లో ఉంది. ఇక చంద్రబాబు వియ్యంకుడు బాలయ్య బంధువైన రామారావు ఏకంగా 498.83 ఎకరాలు అమరావతిలో కేటాయించబడ్డాయని కత్తి మహేష్ ఆరోపించారు. రాజధానిగా అమరావతిని నిర్ణయించకముందే టీడీపీ నేతలు దాదాపు 4075 ఎకరాల భూములను అమరావతి రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు మంత్రి వర్గ ఉపసంఘం సంచలన నిజాలను బయటపెట్టింది. ఇందులో మాజీ సీఎం చంద్రబాబు హెరిటేజ్ సంస్థ లింగమనేని హరి ప్రసాద్ ల పేర్ల తో భారీగా భూములు కొనుగోలు చేసినట్టు వివరాలతో కూడిన నివేదిక ప్రభుత్వానికి అందింది. గత ప్రభుత్వం లో మంత్రులు పరిటాల సునీత నారాయణ ప్రత్తిపాటిలతో పాటు టీడీపీ ముఖ్య నేతలు భూములు కొన్నట్టు కమిటీ నిగ్గుతేల్చింది. అమరావతి రాజధాని పేరు తో టీడీపీ ప్రభుత్వం నేతలు పాల్పడిన భూకుంభకోణాన్ని వైసీపీ ప్రభుత్వం బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. అమరావతి భూబకాసురుల పై మంత్రివర్గ ఉపసంఘం కీలక నివేదిక ను కేబినెట్ భేటి లో బయట పెట్టింది. దీన్ని బట్టి టీడీపీ నేతలు అమరావతి పేరు చెప్పి వేల కోట్ల అవినీతి చేసినట్టు.. ఆధారాలతో సహా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్టు  వైసీపీ ప్రభుత్వం గుర్తించి దీని పై సీబీఐ విచారణ కు రెడీ అవుతోంది.