రాజధాని రచ్చ..బీజేపీ వ్యూహాం... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాజధాని రచ్చ..బీజేపీ వ్యూహాం...

గుంటూరు, డిసెంబర్ 24, (way2newstv.com)
రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చింది. చంద్రబాబు మీద పగతో ఎలాగైనా అమరావతిని ఎదగనీయకుండా చేయాలన్న దాంతో జగన్ ఈ నిర్ణయం తీసుకుంటున్న విషయం బహిరంగ రహస్యం. తన కేసుల కోసమే కాకుండా చంద్రబాబు మీద తనకు నచ్చినట్టు వ్యవహరించాలంటే బీజేపీ అండ ఉండాలి. అందుకే బీజేపీ ఎన్నిమాటలన్నీ పడి ఉంటున్నారు మన ముఖ్యమంత్రి జగన్. అయితే జగన్ వరుస నిర్ణయాలు బీజేపీకి పిచ్చెక్కిస్తున్నాయి. సైలెంటుగా ఉంటే బీజేపీకి కేంద్రానికి డ్యామేజ్ చేసేలా ఉన్నాయి. ఇసుక విషయంలో గాని, రంగుల విషయంలో గాని, మత మార్పిళ్ల విషయంలో గాని... తాజాగా రాజధాని విషయంలో గాని... జగన్ ఆలోచనా విధానం ఈరోజో రేపో బీజేపీతో సంబంధాలు తెంచేలా ఉంది.తాజాగా బీజేపీ నేతల నుంచి రాజధానిపై రెండు కీలక స్పందనలు వెలువడ్డాయి. ఏపీ రాజధాని మార్పు వివాదంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. 
రాజధాని రచ్చ..బీజేపీ వ్యూహాం...

మూడు రాజధానుల విషయంలో బీజేపీ వైఖరిని ఆయన వెల్లడించారు. ‘‘బీజేపీ అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటోంది. కానీ పరిపాలనా వికేంద్రీకరణను కాదు. ఇక్కడి ప్రభుత్వం చేసే పిచ్చి పనుల్లో కేంద్రం జోక్యం చేసుకోదు. రాష్ట్రంలో తీసుకునే నిర్ణయాలకు చివరాఖరికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నారు. అనంతరం కన్నా తన వ్యక్తిగత అభిప్రాయం చెబుతూ... రాజధాని మారడం అనేది స్వతంత్ర భారత చరిత్రలో ఎక్కడా జరగలేదు. సీఎం మారినప్పుడల్లా రాజధాని మారుతుందనేది జగన్ నాయకత్వంలో మొదటిసారి చూస్తున్నాం. రాజధానిపై వైసీపీ నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా, సీఎం మారితే ప్రభుత్వ విధానాలు మారతాయా? అంటూ కన్నా అసహనం వ్యక్తం చేశారు. పైగా అదేదో వాళ్ల వ్యక్తిగత వ్యవహారం అయినట్టు ఒకరు మూడు రాజధానులంటారు, మరొకాయన 3 కాకపోతే 33 పెట్టుకుంటాం అంటారు. అలాంటి హక్కు ప్రజలు మీకు ఇవ్వలేదని కన్నా హెచ్చరించారు.150 సీట్లు ఉండి కూడా జగన్ లో అభద్రతాభావం స్పస్టంగా కనిపిస్తోందన్నారు.  ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది వైసీపీ చెబుతూ వస్తోంది. కానీ ఆరునెలలుగా దీనిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని కన్నా ప్రశ్నించారు. చంద్రబాబుపై ఉన్న కక్షతో ప్రజల్ని ఇబ్బంది పెడితే చూస్తు ఊరుకోం అని హెచ్చరించారు కన్నా.మరోవైపు మరో బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుజన చౌదరి కూడా రాజధానిపై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల కాన్సెప్ట్ పై కేంద్ర ప్రభుత్వం తగిన సమయంలో స్పందిస్తుందని ఆయన అన్నారు. రాజధాని మార్చడం సులభమైన విషయం కాదన్నారు. జరగాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రమే, రాజధానుల మార్పు కాదని సుజన వ్యాఖ్యానించారు. జీఎన్ రావు కమిటీది తప్పుడు సలహా. అమరావతిని తరలిస్తే... రాజధాని రైతులకు ఎలా న్యాయం చేయగలరా కనీసం ఆలోచించారా? అని సుజన ప్రశ్నించారు.